తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీ అలా అవుతాడని వాళ్లకు చెప్పింది నేనే'.. సచిన్ కీలక వ్యాఖ్యలు

టీమ్​ ఇండియా మాజీ సారథి ఎంఎస్​ ధోనీ గురించి సచిన్​ తెందూల్కర్ కీలక విషయాలు వెల్లడించాడు. ధోనీకి పగ్గాలు అప్పగించాలని తానే సూచించినట్లు తెలిపాడు. ఇంకా ఏమన్నాడంటే..

sachin tendulkar ms dhoni
sachin tendulkar ms dhoni

By

Published : Dec 22, 2022, 7:53 PM IST

ధోనీ.. ఈ పేరు వింటే అభిమానులు పరవశించిపోతారు. అంతలా భారత క్రికెట్​ గతిని మార్చిన కెప్టెన్​. క్రికెట్​ లెజెండ్​గా చెప్పుకునే సచిన్​ తెందూల్కర్​ కూడా కెప్టెన్సీలో ధోనీలా విజయం సాధించలేక పోయాడు. అయితే, ధోనీకి పగ్గాలు అప్పగించడంలో కీలకంగా వ్యవహరించాడు సచిన్. సారథి కోసం బీసీసీఐ అన్వేషించినప్పుడు ధోనీ పేరును సూచించాడు. టీమ్​ఇండియా కెప్టెన్‌గా రాహుల్ ద్రావిడ్ ఉన్న సమయంలో టీ20 ఫార్మాట్‌ను పరిచయం చేయాలని, వరల్డ్ కప్ నిర్వహించాలని ఐసీసీ భావించింది. ఈ క్రమంలో యువ జట్టును ఎంపిక చేసి పంపాలని బీసీసీఐ అనుకుంది. అప్పుడే టీమ్​ఇండియాకు ఎవరిని సారిథిని చేయాలి అనే ప్రశ్న తలెత్తింది. వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ లాంటి సీనియర్​ ప్లేయర్లు అప్పుడు జట్టులో ఉన్నా.. వారందరినీ కాదని.. ధోనీకి పగ్గాలు అప్పగించాలని సచిన్ సూచించాడు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో అని.. తాజాగా ఇన్ఫోసిస్​ నిర్వహించిన ఓ ఈవెంట్​లో మాస్టర్​ బ్లాస్టర్ వెల్లడించాడు.

ఎంఎస్​ ధోనీ

"ఇంగ్లండ్‌లో ఉండగా నాకు కెప్టెన్సీ ఆఫర్ వచ్చింది. అప్పుడే జట్టులో జూనియర్లలో ఒక మంచి లీడర్ ఉన్నాడని చెప్పా. అతడ్ని జాగ్రత్తగా గమనించాలని, భవిష్యత్తులో మంచి సారథి అయ్యే సత్తా అతనికి ఉందని సూచించా. ఎందుకంటే నేను ధోనీతో చాలా మాట్లాడేవాడిని. స్లిప్స్‌లో ఉండగా కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ అయినా.. నేను ధోనీతోనే ఎక్కువ మాట్లాడేవాడిని. అతను చాలా ప్రశాంతంగా మంచి పాయింట్స్ చెప్పేవాడు. నేను ఎలాంటి ప్రశ్న అడిగినా ధోనీ చాలా కూల్​గా పరిస్థితిని అనలైజ్ చేసేవాడు. అదే సమయంలో చాలా బ్యాలెన్స్‌డ్‌గా, మెచ్యూరిటీతో వివరణలు ఇచ్చేవాడు" అని సచిన్ తెలిపాడు.

ఎంఎస్​ ధోనీ

"మంచి కెప్టెన్సీ అంటే ప్రత్యర్థి కన్నా ఒక అడుగు ముందే ఆలోచించడం. అలా ఎవరైనా చేయగలిగితే అతను బెస్ట్ కెప్టెన్ అవుతాడు. అందుకే జోష్ సే నహీ, హోష్ సే ఖేలో (జోష్‌తో కాదు, తెలివిగా ఆడాలి) అని క్రికెట్‌లో అంటుంటాం. పది బంతుల్లో పది వికెట్లు తీయడం కుదరదు. దాని కోసం చాలా ప్లాన్ చేయాలి. రోజు చివరకు స్కోర్‌బోర్డులో ఏముందనేది ముఖ్యం. ఆ లక్షణాలన్నీ ధోనీలో కనిపించాయి. అందుకే అతని పేరు సూచించా" అని చెప్పుకొచ్చాడు మాస్టర్ బ్లాస్టర్.
సచిన్​ తెందూల్కర్​ 2011 వరల్డ్​ కప్​ కూడా ధోనీ సారథ్యంలోనే ఆడాడు. అప్పుడే తన చిరకాల వరల్డ్​ కప్​ స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. 2013లో తన కెరీర్ చివరి మ్యాచ్​ కూడా ధోనీ కెప్టెన్​గా ఉన్నప్పుడే ఆడాడు.

ABOUT THE AUTHOR

...view details