క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కుమారుడు అర్జున్ తెందూల్కర్ ఎట్టకేలకు రంజీల్లోకి అడుగు పెట్టాడు. గోవా తరఫున తన కెరీర్‌లో తొలి రంజీ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అర్జున్‌ను ముంబయి ఫ్రాంచైజీ కొనుగోలు చేసినప్పటికీ.. భారత టీ20 లీగ్‌లో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు.
రంజీల్లోకి అడుగుపెట్టిన సచిన్ తనయుడు అర్జున్ తెందూల్కర్.. - గోవా రంజీ క్రికెట్ టీమ్
తండ్రి గొప్ప క్రికెటర్. కానీ తనయుడు మాత్రం అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. తాజాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అయితే తన రాష్ట్రం కాకుండా పక్కన ఉన్న గోవా తరఫున రంజీల్లోకి అడుగుపెట్టడం విశేషం. అతడెవరో తెలుసా?
ముంబయి తరఫున ఆడేందుకు సరైన అవకాశాలు దక్కకపోవడం వల్ల అర్జున్ గతేడాది గోవాకు మారిపోయాడు. ఇప్పటి వరకు కేవలం ఏడు లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 9 టీ20లను మాత్రమే ఆడాడు. ఇప్పుడు రాజస్థాన్‌తో జట్టులోకి రావడం వల్ల ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసినట్లైంది. ఇప్పటికే ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) కూడా జారీ చేసింది.
'ప్రస్తుత సీజన్‌లో గోవా తరఫున ఆడాలని అర్జున్ భావించాడు. అయితే ముందుగా ఎంసీఏ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాం. అలాగే అతడి ఫిట్‌నెస్, స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించాం. అర్జున్ మాదిరిగానే చాలా మంది గోవా తరఫున ఆడేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఒక ప్రాసెస్ ప్రకారం అవకాశం కల్పిస్తాం. ఇలాగే అర్జున్‌కు అవకాశం వచ్చింది' అని గోవా క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) కార్యదర్శి విపుల్ ఫడ్కే వెల్లడించారు.