Sachin in Pakistan Team: టీమ్ఇండియాకు ఎన్నో విజయాలు అందించి, లెక్కలేనన్ని రికార్డులు నెలకొల్పిన దిగ్గజ బ్యాటర్ సచిన్ తెందూల్కర్. ఇతడి బ్యాటింగ్‌తో దేశానికి ఎంతో పేరుతెచ్చాడు. భారత జట్టును శిఖరాగ్రాన నిలిపాడు. అలాంటి సచిన్ మన దేశం కంటే ముందు దాయాది పాకిస్థాన్ తరఫున ఆడాడంటే నమ్ముగలరా? అవును మీరు విన్నది నిజమే. 1987లో ఈ సంఘటన జరిగింది.
ఏం జరిగింది?
1987లో భారత్ పర్యటనకు వచ్చిన పాక్.. సిరీస్‌కు ముందు ముంబయిలోని బ్రబోర్న్ స్టేడియంలో ప్రాక్టీసు మ్యాచ్ ఆడింది. ఈ వార్మప్ మ్యాచ్‌లో దాయాది జట్టు తరఫున సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు సచిన్. ఆ తర్వాత రెండేళ్లకు టీమ్ఇండియా తరఫున టెస్టు, వన్డేల్లో అరంగేట్రం చేశాడు.
కెరీర్లో మొత్తంగా 200 టెస్టుల్లో 15,921 పరుగులు.. 463 వన్డేల్లో 18,426 పరుగులు.. 78 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 2334 పరుగులు చేశాడు సచిన్. అంతర్జాతీయంగా 100 సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ సచినే.