తెలంగాణ

telangana

ETV Bharat / sports

దాతృత్వాన్ని చాటుకున్న క్రికెట్​ గాడ్​.. పేద పిల్లల కోసం స్కూల్​ కట్టించి.. - sachin foundation builds school in mp

భారత క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందూల్కర్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. మధ్యప్రదేశ్​ రాష్ట్రం సందల్​పూర్​ గ్రామంలో పేద పిల్లలకు ఉచిత విద్యను అందించాలనే ఆశయంతో ఆయన ఒక పాఠశాలను నిర్మిస్తున్నారు.

sachin tendulkar builds a school in MP
sachin tendulkar builds a school in MP

By

Published : May 3, 2023, 6:22 PM IST

Updated : May 3, 2023, 7:04 PM IST

టీమ్​ఇండియా మాజీ బ్యాటర్ సచిన్​ తెందూల్కర్ ఓ​ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా తన ఫౌండేషన్​ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఈ స్టార్​ ప్లేయర్..​ తాజాగా తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మధ్యప్రదేశ్​ దేవాస్ జిల్లా సందల్​పూర్​లో తమ ఫౌండేషన్​ ఆద్వర్యంలో ఓ పాఠశాలను నిర్మిస్తున్నారు.

పేద పిల్లలందరికి ఉచిత విద్యను అందించాలనే ఒక గొప్ప ఆశయంతో ఈ పాఠశాలను నిర్మిస్తున్నట్లు ఫౌండేషన్​ తెలిపింది. ఈ పాఠశాల.. సందల్‌పూర్, చుట్టుపక్కల గ్రామాల్లోని 2300 మంది పిల్లలకు రాబోయే దశాబ్ద కాలంలో ఉచిత విద్యను అందించనుంది. అయితే ఈ పాఠశాలను సచిన్​... తన తల్లిదండ్రులు రజనీ, రమేశ్​ తెందూల్కర్​లకు అంకితం చేశారు. గతంలో సచిన్ మధ్యప్రదేశ్‌లోని సేవనియా గ్రామాన్ని కూడా సందర్శించారు.

మాస్టర్​ బ్లాస్టర్​ క్రికెట్​ రంగం ద్వారా దేశానికి దాదాపు 24 ఏళ్ల పాటు సేవలందించారు. 'మాస్టర్​ బ్లాస్టర్'​, ​'గాడ్​ ఆఫ్​ ది క్రికెట్', 'లిటిల్​ మాస్ట'ర్​ ఇలా ఒకటి రెండు కాదు.. తన అభిమానుల నుంచి ఆయన ఇలాంటివి ఎన్నో బిరుదులను అందుకున్నారు. కొన్ని వందల కొద్ది జ్ఞాపకాలు, ఎన్నో వేల కొద్ది పరుగులు ఆయన సొంతం. ఇంటర్నేషనల్​ క్రికెట్​లో వంద శతకాలు సాధించిన గొప్ప ఆటగాడు ఆయన. 2013లో అంతర్జాతీయ క్రికెట్​ నుంచి రిటైరయ్యాక సచిన్..​ సమాజానికి తనవంతుగా సహాయం చేస్తు ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.

గతంలోనూ గ్రామాన్ని దత్తత తీసుకుని..
2016లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అప్పుడు పదవిలో ఉన్న ఎంపీలు దేశవ్యాప్తంగా పలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ క్రమంలో అప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్న సచిన్​.. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని 'పుట్టంరాజు వారి కండ్రిగ' అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అంతే కాకుండా ఆయన రూ.2.79 కోట్ల ఎంపీ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను సైతం చేపట్టారు. అంతే కాకుండా అప్పట్లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారు నిర్వహించిన గ్రీన్ ఆడిట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే మొట్టమొదటి 'గ్రీన్ విలేజ్' గా సచిన్ దత్తత గ్రామం 'పుట్టంరాజు వారి కండ్రిగ' ఎంపికైంది.

50వ పుట్టిన రోజున గౌరవం
సచిన్ తెందూల్కర్ ఇటీవలే తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ క్రమంలో సచిన్​ పుట్టినరోజు సందర్భంగా... షార్జా క్రికెట్ స్టేడియం ఒక స్టాండ్​కు తెందూల్కర్​ పేరు పెట్టి సత్కరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​లో సచిన్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్​కు గుర్తుగా 'వెస్ట్ స్టాండ్' పేరును 'సచిన్ తెందూల్కర్ స్టాండ్'గా మార్చినట్లు ప్రకటించారు.

Last Updated : May 3, 2023, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details