Shoaib akthar inured Sachin: తన బౌన్సర్లతో ఎంతో మంది మేటి ఆటగాళ్లకు చెమటలు పట్టించాడు పాకిస్థాన్ స్పీడ్‌స్టార్ షోయబ్ అక్తర్. అతడి బౌలింగ్‌లో బ్యాటర్లు గాయపడిన సందర్భాలున్నాయి. అయితే భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ మాత్రం అక్తర్ బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. భారీ స్కోర్లను సాధించాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్తర్.. ఓ ఆసక్తికర సంఘటనను తెలిపాడు. 2006లో టీమ్ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌ను గుర్తుచేసుకున్న అతడు... ఆ సమయంలోనే తాను మాస్టర్‌ను ఓ సారి గాయపరిచినట్లు తెలిపాడు.
అప్పుడు కావాలనే సచిన్‌ను గాయపరిచా: అక్తర్ - సచిన్‌కు గాయం
Shoaib akthar inured Sachin: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఓ సందర్భంలో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్‌ను గాయపరచాలనే ఉద్దేశంతో దూకుడుగా ఆడినట్లు గుర్తుచేసుకున్నాడు. కానీ అదృష్టవశాత్తు మాస్టర్ తప్పించుకున్నాడని పేర్కొన్నాడు.
"కరాచీ లో మూడో టెస్టు జరిగిన సమయంలో సచిన్‌ను గయపరచడమే లక్ష్యంగా బౌలింగ్ చేశాను. అతడు బ్యాటింగ్‌కు దిగగానే లైన్ అండ్ లెంగ్త్‌తో వికెట్ల ముందు బౌలింగ్ చేయమని కెప్టెన్ ఇంజమామ్ నాకు సలహా ఇచ్చాడు. కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. అతడిని ఔట్ చేయాలనే ఉద్దేశంతో ఆడలేదు.. గాయపరచాలనే ఉద్దేశంతోనే దూకుడుగా బౌలింగ్ చేశాడు. అలా నేను వేసిన ఓ బౌన్సర్ మాస్టర్ హెల్మెట్‌ను బలంగా తాకింది. ఇక అతడి పని అయిపోయిందని అనుకున్నాను. కానీ అతడు తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవరితోనూ చెప్పలేదు. మళ్లీ అతడిని దెబ్బతీద్దామనుకున్నా కానీ కుదరలేదు." అని షోయబ్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: దీపక్ చాహర్ రిసెప్షన్.. డ్యాన్స్‌లతో క్రికెటర్ల సందడి