తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రోహిత్-రాహుల్ కాంబో అద్భుతం.. ప్రపంచకప్​ కోసం వెయిటింగ్'

Sachin on Dravid-Rohit: టీమ్​ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ కాంబినేషన్​ అద్భుతమని అన్నాడు దిగ్గజ బ్యాట్స్​మన్ సచిన్ తెందూల్కర్. ఈ ఏడాది ప్రపంచకప్​ భారత్​ గెలిస్తే చూడాలనుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

By

Published : Jan 28, 2022, 4:32 PM IST

sachin
సచిన్

Sachin on Dravid-Rohit: రోహిత్‌ శర్మ- రాహుల్‌ ద్రవిడ్‌ కాంబినేషన్‌ అద్భుతమైనదని, వారిద్దరి నేతృత్వంలో టీమ్‌ఇండియా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ సాధిస్తే చూడాలని ఉందని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ తెందూల్కర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడిన మాస్టర్‌ బ్లాస్టర్‌.. ఇప్పటికే భారత జట్టు ప్రపంచకప్‌ సాధించి 11 ఏళ్లు అవుతోందని గుర్తుచేశాడు. ఈ క్రమంలోనే రోహిత్‌-రాహుల్‌ కాంబినేషన్‌ మరో ట్రోఫీని సాధిస్తే చూడాలని ఉందన్నాడు.

"వచ్చే ఏప్రిల్‌ కల్లా టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ సాధించి 11 ఏళ్లు పూర్తవుతాయి. ఇది ఏళ్ల తరబడి నిరీక్షణ. నాతో సహా ప్రతి ఒక్కరూ మరో ట్రోఫీని బీసీసీఐ క్యాబినెట్‌లో చూడాలని అనుకుంటున్నారు. క్రికెటర్లు అందరూ ఈ ఒక్క ట్రోఫీ కోసమే ఆడతారు. ఇంతకుమించిన పెద్ద కప్‌ ఏదీ లేదు. అది పొట్టి ప్రపంచ కప్‌ అయినా లేక వన్డే ప్రపంచకప్‌ అయినా. అది ఎంతో ప్రత్యేకమైనదే. నేను కూడా అదే ఫీల్‌ అవుతా. అలాగే రోహిత్‌, రాహుల్‌ కాంబినేషన్‌ అద్భుతమైనది. వీరిద్దరూ తమ అత్యుత్తమ ప్రదర్శన చేస్తారని పూర్తి నమ్మకం ఉంది. వీరికి ఎంతో మంది మద్దతు ఉంది. వాళ్లిద్దరూ ఇప్పటికే సరిపడా క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడటంతో ఆటలోని ఎత్తు పల్లాలపై మంచి అవగాహన ఉంటుంది. దీంతో ఈసారి కప్పు సాధించాలంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకపోవడమే చేయాల్సింది" అని సచిన్‌ వివరించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details