Sachin Lofted Shot At Road Safety World Series: రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా మాస్టర్ సచిన్ తెందూల్కర్..ఇండియా లెజెండ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇందులో భాగంగా కాన్పూర్ వేదికగా శనివారం దక్షిణాఫ్రికా లెజెండ్స్‌తో ఈ జట్టు తలపడింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సచిన్ కొద్దిసేపే క్రీజులో నిలిచినప్పటికీ.. తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు.
మఖాయా ఎంటినీ బౌలింగ్‌లో లాఫ్టెడ్ షాట్‌తో మరోసారి పాత మాస్టర్ బ్లాస్టర్‌ను గుర్తుచేశాడు. చూడచక్కటి ఈ షాట్‌తో.. అభిమానుల కేరింతలతో స్టేడియం మార్మోగింది. అతడు క్రీజులో ఉన్నంతసేపు సచిన్.. సచిన్.. అంటూ అభిమానులు సందడి చేశారు.