తెలంగాణ

telangana

ETV Bharat / sports

Sachin Kohli: 'విరాట్​ నా సాయం కోరాడు- కాస్త సమయం అడిగాడు'

Sachin Kohli: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీకి సంబంధించి క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గతంలో కోహ్లీ తన సాయం కోరాడని, బ్యాటింగ్​లో లోటుపాట్లు గురించి చర్చించేందుకు తనకు సమయం కేటాయించమని అడిగాడని తెలిపాడు. ఆ సమయంలో విరాట్​తో కొన్ని విషయాలు పంచుకున్నట్లు సచిన్​ చెప్పాడు.

By

Published : Feb 23, 2022, 8:47 PM IST

Sachin Kohli
Sachin Kohli

Sachin Kohli: టీమ్​ఇండియా స్టార్​ క్రికెటర్​ విరాట్​ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు కిక్రెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​. కోహ్లీ తన కెరీర్​​ రూపుదిద్దుకున్న తీరు పట్ల హర్షం వ్యక్తం చేశాడు. విరాట్​ తన ఆటను మెరుగుపరుచుకోవడానికి చాలా కష్టపడ్డాడని సచిన్​ చెప్పుకొచ్చాడు.

'విరాట్‌ నాకు మంచి స్నేహితుడు. గత దశాబ్దకాలంగా అతని కెరీర్​​ రూపుదిద్దుకున్న తీరు పట్ల సంతోషంగా ఉన్నా. అతను అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేసిన సమయానికి.. నేను జట్టులో సభ్యుడిగా ఉన్నా. అప్పుడు కోహ్లీలో ఒకవిధమైన ఫైర్​ చూశాను. అక్కడి నుంచి తన ఆటను మెరుగుపరుచుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అందుకు తగిన విధంగా తన జీవనశైలిని మార్చుకున్నాడు. అదే అతడి లక్ష్యాలు సాధించడానికి దోహదపడింది" అని సచిన్​ పేర్కొన్నాడు.

గతంలో విరాట్​ కోహ్లీని కలిసిన విషయాన్ని సచిన్ గుర్తుచేసుకున్నాడు​. ఆ సమయంలో విరాట్​.. తన సాయం కోరాడని సచిన్​ తెలిపాడు. తన ఆట తీరులో లోటుపాట్లు గురించి చర్చించినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లతో తనకు తెలిసిన విషయాలను పంచుకోవడంలో తానెప్పడూ ముందుంటానని చెప్పాడు.

"2014లో నేను అతనిని కలిసినట్లు గుర్తుంది. అప్పుడు విరాట్​ నా సాయం కోరాడు. బ్యాటింగ్​లో లోటుపాట్లు గురించి చర్చించేందుకు తనకు సమయం కేటాయించమని రిక్వెస్ట్​ చేశాడు. ఆ సమయంలోనే అతను మెరుగుపడాలని కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం" అని సచిన్​ పేర్కొన్నాడు.

కాగా విరాట్​ గత కొద్ది కాలంగా ఫామ్​ కోల్పోయి రాణించలేకపోతున్నాడు. అతడు సెంచరీ సాధించి రెండేళ్లు దాటిపోయింది. ఈ నేపథ్యంలో కోహ్లీ మునుపటి ఫామ్​ను అందుకోనేందుకు ఓ సారి సచిన్ కలవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:IPL 2022: ఐపీఎల్​కు డేట్​ ఫిక్స్​- నాలుగు వేదికల్లో 70 మ్యాచ్​లు!

ABOUT THE AUTHOR

...view details