శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్.. సచిన్‌కు బౌలింగ్ చేయడం అంటే తనకు అస్సలు భయం ఉండేది కాదని తెలిపాడు. ఓ ఛానల్లో కామెంటేటర్ ఆకాశ్ చోప్రాతో మాట్లాడిన మురళీధరన్.. సెహ్వాగ్, లారాకు బౌలింగ్ చేయడంపై కూడా తన అభిప్రాయాన్ని తెలిపాడు.
"సచిన్‌కు బౌలింగ్ చేయడం అంటే నాకు భయం లేదు. ఎందుకంటే సెహ్వాగ్, లారాలా అతను నన్ను ఇబ్బంది పెట్టడు. ఆఫ్ స్పిన్‌లో వికెట్ కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. నా బౌలింగ్‌తో సచిన్‌ను చాలా సార్లు ఔట్ చేశాను. ఆఫ్‌స్పిన్‌లో సచిన్ ఇబ్బందిపడుతుండటం నేను గమనించాను. బహుశా ఇదే సచిన్ వీక్నెస్ అనుకుంటా."
--ముత్తయ్య మురళీధరన్, శ్రీలంక మాజీ క్రికెటర్.