తెలంగాణ

telangana

ETV Bharat / sports

అప్పుడు రష్మిక, ఇప్పుడు సచిన్- డీప్​ఫేక్​తో బెట్టింగ్ మోసం!

Sachin Deep Fake Video: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఓ బెట్టింగ్ యాప్​ను ఆయన ప్రమోట్ చేస్తున్నట్లు వీడియో సృష్టించారు. దీనిపై సచిన్ క్లారిటీ ఇచ్చారు.

అప్పుడు రష్మిక, ఇప్పుడు సచిన్- డీప్​ఫేక్​తో బెట్టింగ్ మోసం!
అప్పుడు రష్మిక, ఇప్పుడు సచిన్- డీప్​ఫేక్​తో బెట్టింగ్ మోసం!

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 2:20 PM IST

Updated : Jan 15, 2024, 4:05 PM IST

Sachin Deep Fake Video: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల డీప్‌ఫేక్‌ వీడియోలు బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మార్ఫింగ్‌ వీడియోలపై ప్రముఖుల కూడా స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్​కు సంబంధించిన డీప్‌ఫేక్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. సాంకేతిక టెక్నాలజీని వాడి, ఆయన వీడియోతో ఓ బెట్టింగ్ యాప్​ను ప్రమోట్ చేస్తున్నట్లు సృష్టించారు. అయితే దీన్ని మాస్టర్‌ బ్లాస్టర్‌ ఖండించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ సోషల్‌ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

'ఈ వీడియో ఫేక్. టెక్నాలజీని వాడి ఇలాంటివి క్రియేట్ చేయడం బాధాకరం. ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వీడియోలు, యాప్​లు, అడ్వర్​టైజ్​మెంట్​లు ఎక్కడ కనిపించినా వెంటనే ఫిర్యాదు చేయండి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు సోషల్ మీడియా కంపెనీలు కూడా వీటిపై స్పందించాలి. త్వరితగతిన చర్యలు తీసుకోవడం అత్యవసరం" అని ట్విట్టర్​లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను కేంద్ర ఐటీశాఖ మంత్రి ఖాతా, మహారాష్ట్ర సైబర్‌ విభాగ ఖాతాకు ట్యాగ్‌ చేశారు.

కాగా, సచిన్​ 'స్కైవార్డ్‌ ఏవియేటర్‌ క్వెస్ట్‌' పేరుతో ఉన్న గేమింగ్‌ యాప్‌నకు ప్రచారం చేస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ఈ యాప్‌తో డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఆయన చెబుతున్నట్లుగా వీడియోను మార్ఫింగ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో సచిన్‌ దృష్టికి రావడంతో ఆయన దీన్ని ఖండించారు.

ఇకపోతే ఆ మధ్య సచిన్‌ కుమార్తె సారా తెందూల్కర్‌ కూడా డీప్‌ ఫేక్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. టీమ్‌ ఇండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో సారా ఉన్నట్లు మార్ఫింగ్‌ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. సారా తన సోదరుడు అర్జున్‌ తెందూల్కర్‌తో ఉన్న ఫొటోను డీప్‌ఫేక్‌ చేశారు. అర్జున్‌ ముఖం స్థానంలో గిల్‌ ఫొటోను మార్చి వైరల్‌ చేశారు. దీనిపై ఆమె తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఇక, కొంతమంది తన పేరుతో ఫేక్ అకౌంట్స్​ తెరిచారని, వాటిని నమ్మొద్దని పేర్కొన్నారు.

ప్లేయర్లకే కాదు- జెర్సీ నంబర్లకూ రిటైర్మెంట్- మీకు ఈ విషయం తెలుసా?

ఈ క్రెడిట్ మహీ భాయ్​దే- చెన్నై నన్ను నమ్మింది: దూబే

Last Updated : Jan 15, 2024, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details