Sachin Deep Fake Video :ఇటీవలే క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్క్ర్కు సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో నెట్టింట తెగ వైరలైన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజాగా సచిన్ వ్యక్తిగత సహాయకుడు రమేశ్ పార్డే ఫిర్యాదు చేశారు. ఆయన కంప్లైంట్‌ను పరిగణనలోకి తీసుకున్న ముంబయి సైబర్ సెల్ పోలీసులు గురువారం ఓ గేమింగ్ యాప్ కంపెనీ యజమానిపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే ?
Sachin Deep Fake Video Case :ఏఐను దుర్వినియోగం చేస్తూ సెలబ్రిటీలపై కొంతమంది వ్యక్తులు వీడియోలు చేస్తున్నారు. గతంలో రష్మిక, ఆలియాపై కూడా ఇలాంటి వీడియోలు వచ్చాయి. అయితే తాజాగా సచిన్‌పై కూడా ఓ వీడయో వచ్చింది. అందులో ఆయన 'స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్' అనే గేమింగ్ యాప్‌నకు ప్రచారం చేస్తున్నట్లు అందులో ఉంది.
ఇక ఈ వీడియో నెట్టింట తెగ వైరలై సచిన్ దృష్టిలో పడింది. దీంతో వీడియోలో ఉన్నది తాను కాదంటూ ఆయన వివరణ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "టెక్నాలజీని ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం నాకు ఎంతో ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వీడియోలు, యాడ్స్, యాప్స్ ఎక్కడ ఉన్నా సరే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయండి. ఫేక్ ఇన్ఫర్మేషన్, డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి. వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి" అంటూ ట్విట్టర్లో సచిన్ పోస్ట్ చేశారు.