Saba Karim On Rishabh Pant : మొన్నటి వరకు విరాట్ కోహ్లీ ఫామ్‌పై కొనసాగిన చర్చ.. ఇప్పుడు రిషభ్ పంత్‌వైపు మళ్లింది. తాజాగా ఆసియా కప్‌లో పాక్‌పై భారత్ విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో రిషభ్ పంత్‌ను కాదని సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్‌ను మేనేజ్‌మెంట్ తుది జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలో పంత్‌ను పక్కనపెట్టడంపై పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే బాటలో టీమ్‌ఇండియా మాజీ సెలెక్టర్ సబా కరీం కూడా పంత్ వంటి కీలక ఆటగాడిని బయట ఎలా కూర్చోబెడతారని ప్రశ్నించాడు. టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నాడు.
"ఆసియా కప్ మొత్తం దినేశ్ కార్తిక్‌కు చోటు కల్పించేందుకు టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు నాకు అనిపిస్తోంది. అందుకే రవీంద్ర జడేజాను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపిస్తూ ఉన్నారు. జడేజా పరిణతి చెందిన లెఫ్టార్మ్ బ్యాటర్. నాలుగు లేదా ఐదో స్థానంలో పంపినా.. లేకపోతే లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన వేగంగా పరుగులు చేయగలడు. అందుకే తుది జట్టులోకి రిషభ్ పంత్‌కు చోటు లేదేమోనని అనిపిస్తుంది. అయితే రిషభ్ పంత్ ఎక్స్-ఫ్యాక్టర్ ప్లేయర్. తనదైన టాలెంట్‌తో విజయావకాశాలు లేని పరిస్థితుల్లోనూ మ్యాచ్‌లను గెలిపించగల సత్తా పంత్ సొంతమని భావిస్తున్నా. అందుకే పంత్‌లాంటి కీలక ఆటగాడిని బెంచ్‌పై ఎందుకు కూర్చోబెడుతున్నారు? అలాగే రిషభ్ పంత్ కూడా టెస్టులు, వన్డేలతో పోలిస్తే టీ20ల్లో గణాంకాలను ఇంకా మెరుగు పరుచుకోవాలి" అని సబా కరీం వివరించాడు. ఇవాళ ఆసియా కప్‌లో భాగంగా హాంగ్‌కాంగ్‌తో భారత్ తలపడనుంది. మరి ఈ మ్యాచ్‌లోనైనా పంత్‌కు అవకాశం దక్కుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.