SA vs IND: టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ.. తన చర్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. అవును.. దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అదే సమయంలో క్రీజులో ఉన్న కోహ్లీ.. అవాక్కై పంత్‌వైపు చూస్తూ ఉండిపోయాడు. అలా తన అసంతృప్తిని వ్యక్తపరిచాడు కోహ్లీ. ఈ దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
23వ ఓవర్లో.. దక్షిణాఫ్రికా బౌలర్ పెహ్లువాకియా వేసిన బంతికి మగలాకు క్యాచ్ ఇచ్చాడు పంత్. దీంతో ఒక్కపరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు పంత్.
దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలోనూ పేలవ ప్రదర్శన కనబరిచాడు పంత్. అయితే రెండో వన్డేలో 71 బంతుల్లో 85 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కానీ మళ్లీ మూడో వన్డేలో డకౌట్ అయి చేతులెత్తేశాడు పంత్.