SA vs AFG World Cup 2023 :2023 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా ఏడో విజయాన్ని నమోదు చేసింది. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్‌తో తలపడ్డ సఫారీ జట్టు.. 5 వికెట్ల తేడాతో నెగ్గింది. అఫ్గాన్ నిర్దేశించిన 245 పరుగుల లక్ష్యాన్ని 47.3 ఓవర్లలో సౌతాఫ్రికా ఛేదించింది. బ్యాటర్లు రస్సీ వాన్‌డర్ డస్సెన్ (76 పరుగులు) హాఫ్ సెంచరీ చేయగా.. ఓపెనర్ క్వింటన్ డికాక్ (41), పెహ్లుక్వాయో (39) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో మహ్మద్ నబీ 2, రషీద్ ఖాన్ 2, ముజీబ్ అర్ రహ్మన్ 1 వికెట్ దక్కించుకున్నారు. సౌతాఫ్రికా బ్యాటర్ రస్సీ వాన్‌డర్ డస్సెన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా.. టోర్నీలో 7 విజయాలతో పాయింట్ల పట్టకలో రెండో స్థానంతో లీగ్ దశను ముగించగా.. 4 విజయాలతో పట్టికలో ఆరో స్థానంతో టోర్నీ నుంచి అఫ్గాన్ నిష్క్రమించింది.
245 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సఫారీలకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు డికాక్, బవూమా (23 పరుగులు) తొలి వికెట్‌కు 10.6 ఓవర్లలో 64 పరుగులు జోడించారు. స్పిన్నర్ ముజీబ్ ఈ జోడీని విడగొట్టాడు. అనంతరం వన్ డౌన్లో వచ్చిన డస్సెన్ స్కోర్ బోర్డను ముందుకు నడిపించాడు. ఇక మర్క్రమ్ (25), క్లాసెన్ (10), మిల్లర్ (24) తక్కువ స్కోర్లకే ఔటనప్పటికీ.. పెహ్లుక్వాయోతో కలిసి డస్సెన్ సౌతాఫ్రికాను గెలిపించాడు.