S Sreesanth: టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ ఎస్ శ్రీశాంత్ రిటైర్మెంట్ ప్రకటించారు. భారత్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ సహా అన్ని ఫార్మాట్లకు నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. "భవిష్యత్ తరం క్రికెటర్ల కోసం నా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్‌ను ముగించాలని అనుకుంటున్నాను." అని ట్వీట్ చేశారు.
అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన శ్రీశాంత్ - S Sreesanth announces retirement
S Sreesanth: ఫస్ట్‌క్లాస్ క్రికెట్ సహా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించారు భారత పేసర్ శ్రీశాంత్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
2012లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ బౌలర్ శ్రీశాంత్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత తప్పు ఒప్పుకోవడం వల్ల ఇతడిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. 2018లో బ్యాన్ ఎత్తివేసి, ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అతడికి అనుమతిచ్చింది. 2020లో అతడిపై భారత బోర్డు విధించిన ఏడేళ్ల నిషేధం పూర్తయింది. దీంతో గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కేరళ తరఫున ఆడారు.
ఇదీ చదవండి:Test Rankings 2022: టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అతడే నెం. 1