తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రుతురాజ్‌-ఇషాన్‌.. అది మంచి పద్ధతి కాదయ్యా'.. నెట్టింట ఫుల్​ ట్రోలింగ్‌! - భారత్​ క్రికెట్​ టీమ్

టీమ్‌ఇండియా అరంగేట్రం బ్యాటర్ రుతురాజ్‌ గైక్వాడ్‌తోపాటు ఇషాన్‌ కిషన్‌.. గురువారం జరిగిన వన్డేలో మరీ నెమ్మదిగా ఆడటం విమర్శలకు దారితీసింది. నెట్టింట్లో ట్రోలింగ్‌ మొదలైంది. వీరి బ్యాటింగ్‌ పైన మీమ్స్‌, జోకులు పేలుతున్నాయి.

ruturaj-gaikwads-snarling-odi-debut-triggers-memes-and-jokes-on-social-media
ruturaj-gaikwads-snarling-odi-debut-triggers-memes-and-jokes-on-social-media

By

Published : Oct 7, 2022, 2:15 PM IST

దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో వర్షం కారణంగా బ్యాటింగ్‌ చేసేందుకు ఇబ్బందిగా మారిన పిచ్‌పై.. టీమ్‌ఇండియా అరంగేట్రం బ్యాటర్ రుతురాజ్‌ గైక్వాడ్‌తోపాటు ఇషాన్‌ కిషన్‌ మరీ నెమ్మదిగా ఆడటం విమర్శలకు దారితీసింది. నెట్టింట్లో ట్రోలింగ్‌ మొదలైంది. భారత టీ20 లీగ్‌లో అదరగొట్టే గైక్వాడ్‌.. జాతీయ జట్టు తరఫున జిడ్డుగా బ్యాటింగ్‌ చేయడంపైనా మీమ్స్‌, జోకులు పేలుతున్నాయి.

పరుగుల ఖాతాను తెరిచేందుకే పది బంతులను తీసుకొన్న రుతురాజ్‌.. తర్వాత కూడా ధాటిగా ఆడలేకపోయాడు. చివరికి 42 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మరో బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ కూడా 37 బంతులను ఎదుర్కొని 20 పరుగులు మాత్రమే చేయడంతో చివర్లో లక్ష్య ఛేదన రన్‌రేట్‌ పెరిగిపోయిందని అభిమానులు విమర్శలు గుప్పించారు. వీరిద్దరూ తమ స్థానాలను సురక్షితంగా ఉంచుకునేందుకు మాత్రమే ఆడారని, స్వార్థపూరితంగా బ్యాటింగ్‌ చేశారని నెటిజన్లు మండిపడ్డారు. 'భారత భావి ఓపెనర్లు వీరే'.. అంటూ మరొక అభిమాని వ్యంగ్యంగా స్పందించాడు.

ABOUT THE AUTHOR

...view details