Ruturaj Gaikwad Poor Form: రుతురాజ్ గైక్వాడ్.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున విజయవంతమైన ఆటగాడు. గతేడాది అత్యద్బుత ప్రదర్శనతో చెన్నై టైటిల్ విజేతగా నిలవడంలో ఇతడిది ప్రధాన పాత్రగా చెప్పొచ్చు. మొత్తంగా 16 మ్యాచ్‌ల్లో 635 పరుగులు చేసి లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. చిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత టీమ్ఇండియాలోనూ చోటు సంపాదించాడు. ఐపీఎల్లో ఇతడికి తోడు ఫాఫ్ డుప్లెసిస్(633 పరుగులు) కూడా దూకుడుగా ఆడాడు. దాదాపు ప్రతిమ్యాచ్‌లోనూ శుభారంభంతో చెన్నైకి భారీ స్కోరు అందించి.. విజయాల్లో కీలకంగా నిలిచారు. ఈసారి ఐపీఎల్లో ఫాఫ్‌ను వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. మరోవైపు.. ఈసారీ చెన్నై తరఫునే ఆడుతున్న గైక్వాడ్ వరుసగా విఫలమవుతున్నాడు. ఆడిన 4 మ్యాచ్‌ల్లో కలిపి 18 పరుగులే చేశాడు.
తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై 1, పంజాబ్‌పై 1, సన్‌రైజర్స్‌పై 16 పరుగులు చేసి అవుటయ్యాడు. దాదాపు అన్నింట్లోనూ నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు గైక్వాడ్. ఇతడి ఫామ్ ఇప్పుడు చెన్నైని కలవరపెడుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. గతంలో బ్యాటింగ్‌లో డుప్లెసిస్, గైక్వాడ్, మొయిన్ అలీ.. చెన్నైకి వెన్నెముకగా నిలిచారు. ఈసారి గైక్వాడ్ వైఫల్యంతో.. మొత్తం భారం అలీపైనే పడుతుంది. రాయుడు, జడేజా కూడా నిలకడగా ఆడలేకపోతున్నారు. బౌలింగ్‌లోనూ కోట్లు పెట్టి కొనుక్కున్న దీపక్ చాహర్ దూరమవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ. మరో ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకుర్‌ను వేలంలో దిల్లీ దక్కించుకుంది. బ్రావో వయసు మీద పడుతుంది. ఫలితంగా.. బౌలింగ్‌లోనూ తేలిపోతుంది. ఇదే ఇప్పుడు చెన్నైని దెబ్బతీస్తుంది.