IND Vs SL Ruturaj Gaikwad injury: టీమ్ఇండియాను గాయల బెడద వెంటాడుతోంది. శ్రీలంకతో జరుగుతోన్న సిరీస్‌లో భాగంగా రెండో టీ20కు కీలక ఆటగాడు దూరం కానున్నాడు. ఇప్పటికే మణికట్టుకు గాయం అవ్వడం వల్ల మెదటి మ్యాచ్‌కు దూరమైన రుతురాజ్ గైక్వాడ్.. గాయం తీవ్రతరం కావడం వల్ల ఇప్పుడు పూర్తిగా సిరీస్ నుంచి వైదొలిగాడు. మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండట్లేదు. అతడి స్థానంలో మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు.
IND VS SL: సిరీస్ నుంచి వైదొలిగిన గైక్వాడ్... మయాంక్‌కు ఛాన్స్ - మయాంక్ అగర్వాల్
IND Vs SL Ruturaj Gaikwad injury: గాయం కారణంగా లంకతో తొలి టీ20కు దూరమైన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు పూర్తిగా సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్ జట్టులోకి రానున్నాడు.
ఇప్పటికే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, సూర్యకుమార్ యాదవ్‌లు ఈ టీ20 సిరీస్‌కు దూరమయ్యారు. కాగా, లంకతో జరిగిన తొలి టీ20లో భారత్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. శనివారం ధర్మశాలలో రెండో టీ20 ఆడనుంది.
ఇదీ చదవండి:టీమ్ఇండియా జోరు.. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే