ప్రతిష్టాత్మక దేశవాళీ ట్రోర్నీ విజయ్ హజారే ట్రోఫీ రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాదిన తొలి బ్యాటర్‌గా రుతురాజ్ గైక్వాడ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ మహారాష్ట్ర బ్యాటర్ 159 బంతుల్లో 220 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
అయితే తాజాగా కామెంటేటర్ ఆకాశ్ చోప్రాతో యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన గైక్వాడ్.. మాజీ కెప్టెన్ ధోనీ తానెంతో నేర్చుకున్నట్లు చెప్పాడు. జట్టు గెలుస్తున్నప్పుడు అతిగా స్పందించకపోవడం.. భావోద్వేగాలను నియంత్రించుకొని.. న్యూట్రల్‌గా ఉండటాన్ని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే సమయంలో మహీ దగ్గర్నుంచి నేర్చుకున్నానని తెలిపాడు.
జట్టు ఓడినా సరే డ్రెస్సింగ్ రూంలో ధోనీ సానుకూల దృక్పథాన్ని నింపడానికి ప్రయత్నించేవాడని పేర్కొన్నాడు. అతడి సపోర్ట్‌తోనే క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టు ఏకతాటిపై ఉండేదని.. టీమ్ స్పిరిట్ పెరగడానికి మహీ సాయం చేసేవాడని చెప్పుకొచ్చాడు.