Delhi net bowler corona: దిల్లీ క్యాపిటల్స్ జట్టులో మళ్లీ కరోనా కలకలం రేపింది. ఆ టీమ్‌లోని ఓ నెట్ బౌలర్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. చెన్నైతో నేడు(ఆదివారం) మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేశారు. ఈ టెస్టుల్లోనే ఓ ఆటగాడికి వైరస్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. మరికొద్దిగంటల్లో మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆటగాడు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. "ఈ రోజు ఉదయం చేసిన టెస్టుల్లో ఓ నెట్ బౌలర్‌కు పాజిటివ్‌గా తేలింది. ఆటగాళ్లను రూమ్స్‌లోనే ఐసోలేషన్‌లో ఉండాలని సూచించాం" అని ఓ ఐపీఎల్ ప్రతినిధి తెలిపారు.
ఐపీఎల్ ప్రొటోకాల్ ప్రకారం ఆటగాళ్లకు మరోసారి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగా ప్లేయర్స్‌ను ఐసోలేషన్‌లో ఉంచాలా లేదా సహా మ్యాచ్ జరిగే విషయంపై నిర్ణయం తీసుకుంటారు.