తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాజస్థాన్​ రాయల్స్​తో మ్యాచ్​.. ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్​! - ipl today match

RR vs RCB: ఐపీఎల్​ 2022లో మంగళవారం రాజస్థాన్​ రాయల్స్​తో తలపడనుంది రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు. ఆడిన రెండు మ్యాచ్​ల్లో గెలిచిన రాయల్స్​.. ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. ఒకటి గెలిచి.. మరోటి ఓడిన ఆర్సీబీ జట్టులో సమతూకం లోపించింది. ఆ టీం స్టార్​ ప్లేయర్​ రాయల్స్​తో మ్యాచ్​ ఆడట్లేదని యాజమాన్యం తెలిపింది.

RR vs RCB:
RR vs RCB:

By

Published : Apr 5, 2022, 2:00 PM IST

Updated : Apr 5, 2022, 2:27 PM IST

RR vs RCB: ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో మంగళవారం మరో ఆసక్తికర పోరు జరగనుంది. దూకుడుగా ఆడుతూ విజయాలు సాధిస్తున్న రాజస్థాన్​ రాయల్స్​.. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్​ జరగనుంది. ముంబయి వాంఖడే స్టేడియం వేదిక. రాయల్స్​ గత మ్యాచ్​లో ముంబయిపై 23 పరుగుల తేడాతో గెలిచింది. తమ చివరి మ్యాచ్​లో కోల్​కతాపై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆర్సీబీ. రాజస్థాన్​ రాయల్స్​ అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తుంది. బ్యాటింగ్​లో భారీ స్కోరు చేస్తూ.. ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బెంగళూరుకు మాత్రం.. ఆ జట్టు స్టార్​ ప్లేయర్​ గ్లెన్​ మాక్స్​వెల్ లేకపోవడం లోటుగా కనిపిస్తుంది. మాక్సీ.. ఈ మ్యాచ్​కు కూడా అందుబాటులో ఉండట్లేదని యాజమాన్యం తెలిపింది. ఆస్ట్రేలియా కాంట్రాక్ట్​ క్రికెటర్లు ఎవరూ ఏప్రిల్​ 6 లోపు ఐపీఎల్​లో ఆడకూడదని క్రికెట్​ ఆస్ట్రేలియా ముందే స్పష్టం చేసింది. దీంతో.. మాక్సీ ఆర్సీబీ క్యాంప్​లో చేరినా మ్యాచ్​కు దూరంగా ఉండనున్నాడు. అతడు ఏప్రిల్​ 9న ముంబయితో మ్యాచ్​కు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీ పేసర్​ జోష్​ హేజిల్​ వుడ్​.. ఏప్రిల్​ 12న చెన్నైతో మ్యాచ్​ సమయానికి అందుబాటులో ఉంటాడని తెలిపింది యాజమాన్యం. ​

ముంబయితో మ్యాచ్​లో సెంచరీ చేసిన జోస్​ బట్లర్​, యశస్వి జైస్వాల్​తో రాజస్థాన్​ ఓపెనింగ్​ బలంగా ఉంది. ఆ తర్వాత వచ్చే దేవ్​దత్​ పడిక్కల్​, కెప్టెన్​ శాంసన్​ కూడా మంచి ఫామ్​లో ఉన్నారు. హెట్​మయర్​ ఆఖర్లో విధ్వంసక ఇన్నింగ్స్​లతో చెలరేగిపోతున్నాడు. వీరిని ఆపడం బెంగళూరుకు కష్టమనే చెప్పొచ్చు. ట్రెంట్​ బౌల్ట్​, ప్రసిద్ధ్​ కృష్ణ, నవ్​దీప్​ సైనీలతో పేస్​ విభాగం కూడా దుర్బేధ్యంగా ఉంది. గత మ్యాచ్​ హీరోలు అశ్విన్​, చాహల్​ తిప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరందరితో రాయల్స్​ బలోపేతంగా కనిపిస్తోంది.

మరోవైపు.. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరులో నిలకడ లోపించింది. ఆ జట్టు బౌలింగ్​లో ఎక్కువగా లంక స్పిన్నర్​ వనిందు హసరంగపైనే నమ్మకం పెట్టుకుంది. పేసర్లలో సిరాజ్​ మినహా.. పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేని ఆకాశ్​ దీప్​, డేవిడ్​ విల్లే అంతగా రాణించింది లేదు. రాయల్స్​ బ్యాటర్లను కట్టడి చేయాలంటే.. బెంగళూరు డెత్​ ఓవర్ల స్పెషలిస్ట్​ హర్షల్​ పటేల్​ గాడినపడాల్సి ఉంది. బ్యాటింగ్​లో డుప్లెసిస్​ ఆకట్టుకుంటున్నా మరో ఓపెనర్ అనుజ్​ రావత్​ వరుసగా రెండు మ్యాచ్​ల్లో విఫలమయ్యాడు. ​కోహ్లీ, దినేశ్​ కార్తిక్​ మంచి ఆరంభాల్ని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నారు.

ఇవీ చూడండి:టీమ్​ఇండియా యువ క్రికెటర్​పై శాస్త్రి సంచలన వ్యాఖ్యలు

'ఆ ఒక్కటి జరగకపోయుంటే.. రోహిత్​కు ఎప్పుడో కెప్టెన్సీ'

Last Updated : Apr 5, 2022, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details