తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ross Taylor Retirement: అంతర్జాతీయ క్రికెట్​కు రాస్​ టేలర్ గుడ్​బై

Ross Taylor Retirement: అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు న్యూజిలాండ్ బ్యాటర్​ రాస్ టేలర్. వచ్చే ఏడాది వేసవి వరకు సొంతగడ్డపై రెండు టెస్టులు, ఆరు వన్డేలు ఆడి అన్నిఫార్మాట్లకు దూరం కానున్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నాడు.

ross taylor
రాస్ టేలర్

By

Published : Dec 30, 2021, 9:10 AM IST

Ross Taylor Retirement: న్యూజిలాండ్ బ్యాటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్​తో టెస్టు సిరీస్​ అనంతరం టెస్టు క్రికెట్​కు దూరం కానున్నట్లు తెలిపాడు. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్​తో సిరీస్​ల అనంతరం వన్డే జట్టుకు కూడా దూరం కానున్నట్లు పేర్కొన్నాడు. వచ్చే ఏడాది వేసవి కాలం వరకు అన్ని ఫార్మాట్లకు గుడ్​బై చెప్పనున్నట్లు స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు టేలర్.

"17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్​కు గుడ్​బై చెబుతున్నా. సొంతగడ్డపై బంగ్లాదేశ్​తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్​తో ఆరు వన్డేలు ఆడిన తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటా. ఇన్ని సంవత్సరాలు నాకు మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు."

--రాస్ టేలర్, న్యూజిలాండ్ బ్యాటర్.

2006లో వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో అరంగేట్రం చేశాడు టేలర్. ఇప్పటివరకు 233 వన్డేలు ఆడిన అతడు.. 8576 పరుగులు చేశాడు. ఇతర ఫార్మాట్లలోనూ న్యూజిలాండ్ తరఫున ప్రత్యేకంగా నిలిచాడు. మొత్తంగా 102 టీ20ల్లో 1909 పరుగులు, 110 టెస్టుల్లో 7585 పరుగులు చేశాడు.

రాస్ టేలర్

ఇదీ చదవండి:

టెస్టుల్లో బౌలర్ బుమ్రా సరికొత్త రికార్డు

IND VS SA: విజయానికి ఆరు వికెట్లు దూరంలో టీమ్​ఇండియా

ABOUT THE AUTHOR

...view details