టీమ్ఇండియా ప్రస్తుతం మంచి జోష్‌లో పరిగెడుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు.. ఎందులోనూ ఓడిపోలేదు. ఇప్పుడు బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. 2-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు ఆడిన సిరీస్‌లన్నింటిలోనూ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మంచి ప్రదర్శన చేశాడు. మంచి స్ట్రైక్ రేట్‌తోనే ఆడుతున్నాడు. మొత్తం రెండు సెంచరీలు బాదాడు.
అతడి గణాంకాల విషయానికొస్తే.. ఈ ఏడాది అతడు ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లోని 9 ఇన్నింగ్స్ ఆడిన హిట్ మ్యాన్ 56.77 సగటుతో మొత్తం 511 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.
అలాగే ఈ ఏడాది టీమ్ ఇండియా తరఫున అత్యధికంగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. అగ్రస్థానంలో యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 769 రన్స్‌తో నంబర్ వన్‌గా నిలిచాడు.
ఈ ఏడాది టెస్టుల్లో ఇప్పటివరకు అతడు రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లోని మూడు ఇన్నింగ్స్‌ల్లో 61 సగటుతో 183 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది.