శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో చేశాడు. ఈ ఏడాదిని గొప్పగా ఆరంభించాడు. అయితే తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. చాలాకాలం తర్వాత మునపటి టచ్‌లో కనబడిన హిట్ మ్యాన్ 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా 67 బంతులు ఎదుర్కొన్న అతడు 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రోహిత్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మధుశంక బౌలింగ్‌లో బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకోవడంతో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
IND VS SL: రోహిత్ హాఫ్ సెంచరీని ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా?
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేరువగా వచ్చి పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. అయితే అతడు హాఫ్ సెంచరీ బాదాక ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. తన అర్ధ శతకాన్ని ఒకరికి అంకితమిచ్చాడు. ఎవరంటే?
కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాక ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. ఎందుకంటే.. జనవరి 9 రోహిత్ ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క మ్యాజిక్ కన్నుమూసింది. ఈ విషయాన్ని రోహిత్ భార్య రితిక తన ఇన్‌స్టా ద్వారా తెలిపింది. మ్యాజిక్ లేదన్న బాధలోనే ఈ మ్యాచ్ బరిలోకి దిగిన రోహిత్ హాఫ్‌సెంచరీ పూర్తి కాగానే ఆకాశం వైపు చూస్తూ మ్యాజిక్ పేరును స్మరించాడు. హాఫ్ సెంచరీని మ్యాజిక్‌కు అంకితమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ చూడండి:IND VS SL: కోహ్లీ సెంచరీ.. అతడు చెప్పినట్టే జరిగిందిగా!