బంగ్లాతో జరిగిన తొలి వన్డేలో ఓటమిపై నిరాశచెందాడు కెప్టెన్ రోహిత్ శర్మ. తన ఓటమికి గాల కారణాన్ని వివరించాడు. "ఈ మ్యాచ్‌లో మేము అద్భుతంగా పోరాడాం. క్రెడిట్ మొత్తం బౌలర్లకే ఇవ్వాలి. మ్యాచ్‌ను అంత దగ్గరగా తీసుకురావడనికి వాళ్లు చాలా కష్టపడ్డారు. తొలి బంతి నుంచి మా బౌలర్లు బంగ్లా బ్యాటర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. అఖరి వరకు పేసర్లు 100 శాతం ఎఫర్ట్ పెట్టారు. కానీ మేము బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. టార్గెట్ 184 పరుగులు సరిపోవు. మేము మరో 25-30 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం వేరే విధంగా ఉండేది. మా ఇన్నింగ్స్ 25 ఓవర్ల స్కోర్‌ను చూస్తే 240 నుంచి 250 పరుగులు వరకు సాధిస్తామని భావించాము. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో నా మాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాం. ముఖ్యంగా ఇటువంటి పిచ్‌లపై ఎలా ఆడాలో నేర్చుకోవాలి. కాబట్టి తరువాతి మా రెండు ప్రాక్టీస్ సెషన్‌లలో ఈ వికెట్‌ను అర్థం చేసుకుని సాధన చేస్తాం. మా బాయ్స్ ఈ మ్యాచ్ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారని నేను భావిస్తున్నాను. మేము మా తదుపరి మ్యాచ్ కోసం అతృతగా ఎదురుచూస్తున్నాము. రెండో వన్డేలో మెరుగ్గా రాణిస్తామని ఆశిస్తున్నాను" అని రోహిత్ పేర్కొన్నాడు. కాగా, ఇరు జట్లు మధ్య రెండో వన్డే బుధవారం జరగనుంది.
ఫీలైన రోహిత్ శర్మ.. ఆ విషయం నేర్చుకోవాలంటూ.. - rohithsharma on bangladesh second ODI
బంగ్లాతో జరిగిన తొలి వన్డేలో ఓటమిపై మాట్లాడాడు టీమ్ఇండియా కెప్టెన్. ఆ విషయంలో చాలా ఫీలయినట్లు తెలుస్తోంది.
కాగా, తొలి వన్డేలో టీమ్ఇండియాపై బంగ్లాదేశ్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బంగ్లా బ్యాటర్లలో లిటాన్ దాస్ (41) రాణించగా.. చివర్లో మెహిదీ హసన్ (38; 39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి బంగ్లాకు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, కుల్‌దీప్ సేన్ 2, వాషింగ్టన్ సుందర్ 2, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1 -0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇదీ చూడండి:కేఎల్ రాహుల్, సుందర్ ఎందుకలా చేశారో అర్థం కాలేదు: దినేశ్ కార్తిక్