Rohith Six injured child: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో బుమ్రా (6/19) సంచలన బౌలింగ్, ఓపెనర్ రోహిత్ శర్మ (76 నాటౌట్; 58 బంతుల్లో 7×4, 5×6) ధనాధన్ ఇన్నింగ్స్.. మరో ఓపెనర్ ధావన్ (31*; 54 బంతుల్లో 4×4) కూడా నిలకడగా ఆడడంతో భారత్ 18.4 ఓవర్లలో ఒక్క వికెట్టూ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.
అయితే ఈ క్రమంలోనే రోహిత్ బాదిన ఓ భారీ సిక్స్ ఓ చిన్నారిని బాగా బాధించింది. ఐదో ఓవర్లో డేవిడ్ విల్లీ వేసిన మూడో బంతిని ఫుల్ షాట్ ఆడిన హిట్‌మ్యాన్ బలమైన షాట్ కొట్టాడు. అది కాస్త స్టాండ్స్‌లో ఉన్న ఓ చిన్నారికి బలంగా తాకింది. దాంతో ఆ పాప గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. నొప్పిని తట్టుకోలేక విలవిల్లాడింది. ఈ విషయాన్ని బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బెన్‌స్టోక్స్.. రోహిత్‌కు చెప్పాడు. ఇది తెలుసుకున్న హిట్‌మ్యాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో కొద్దిసేపు మ్యాచ్‌ను ఆపారు.