వన్డేల్లో డబుల్ సెంచరీ అనగానే క్రికెట్ అభిమానులకు టక్కున గుర్తొచ్చే పేరు కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే ఇప్పుడు యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్-శుభమన్ గిల్ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023కు ముందు ఈ యువ ఓపెనర్లు డబుల్ సెంచరీలతో అదరగొట్టారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఓపెనింగ్ స్థానం కోసం పోటీపడుతున్నారు. దీంతో వరల్డ్‌కప్‌లో వీరిద్దరిలో ఎవరు ఓపెనర్‌గా దిగుతారనే విషయమై క్రికెట్ ప్రేమికుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు కలిసి న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ తర్వాత ఓ సరదా సంభాషణలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ విశేషాలివీ..
ఇషాన్ కిషన్:మ్యాచ్‌కు ముందు నీ రొటిన్ ఎలా ఉంటుంది గిల్?
రోహిత్ శర్మ: (మధ్యలో కలుగజేసుకుంటూ).. ఆ విషయం అయితే నీక్కూడా తెలియాలి. ఎందుకంటే మీ ఇద్దరు ఒకే రూమ్‌లో ఉంటారు కదా!
శుభ్‌మన్ గిల్:కిషన్ నా ప్రీ మ్యాచ్ రొటీన్ మొత్తాన్ని పాడు చేస్తాడు. ఫుల్ సౌండ్ పెట్టి టీవీ చూస్తాడు. నేను అతడిని బాగా తిడతాను. సౌండ్ తగ్గించమని చెప్తాను. కానీ నా మాట మాత్రం వినడు. ఇది నా రూమ్.. నేను చెప్పిన రూల్సే ఇక్కడ పాటించాలి అంటాడు. ఈ విషయంలో ఇద్దరికీ గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇదే నా ప్రీ మ్యాచ్ రొటీన్.
ఇషాన్ కిషన్: నేనిలా ఎందుకు చేస్తానంటే నువ్వు నా గదిలో పడుకుంటున్నావు. అంతేకాదు నేను చేయాల్సిన పరుగులు నీ ఖాతాలో వేసుకుంటావు.
ఇకపోతే న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో శుభమన్ గిల్ అద్భుతంగా ఆడాడు. డబుల్ సెంచరీతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో వీరవిహారం చేశాడు. భారత్ తరఫున డబుల్ సెంచరీ బాదిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. డబుల్ సెంచరీ బాదిన అత్యంత పిన్నవయస్కుడిగా శుభ్‌మన్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ రికార్డును అధిగమించాడు. 24 ఏళ్ల 145 రోజుల వయసుతో ఇషాన్ కిషన్ డబుల్ బాదగా.. 23 ఏళ్ల 132 రోజుల వయసుతో శుభ్‌మన్ గిల్ అధిగమించాడు. 23 ఏళ్ల వయసులో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు నమోదు చేసిన మూడో బ్యాటర్‌గా.. అత్యంత వేగంగా మూడు సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా శుభ్‌మన్ నిలిచాడు. శుభ్‌మన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్ మిచెల్ రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్క్‌నర్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి:Gill Double centuryతో ఆ విమర్శలకు చెక్.. ఇక ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా?