బంగ్లాదేశ్ పర్యటనలో తొలి వన్డేలో ఓడిన టీమ్ఇండియాకు రెండో వన్డేలోనూ ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో క్రీజు వదిలాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లాదేశ్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో 1 పరుగు మాత్రమే చేసింది. అయితే మహ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో మొదటి రెండు బంతుల్లో రెండు ఫోర్లు బాదాడు అన్‌మోల్ హక్. ఆ తర్వాతి బంతికి 2 పరుగులు వచ్చాయి. మొదటి మూడు బంతుల్లో 10 పరుగులు ఇచ్చేశాడు మహ్మద్ సిరాజ్. ఈ క్రమంలోనే నాలుగో బంతికి అన్‌మోల్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ.. గాయం బారిన పడ్డాడు. అతడి చేతి బొటన వేలికి గాయమైంది.
టీమ్ఇండియాకు మరో బిగ్ షాక్.. కెప్టెన్ రోహిత్‌కు గాయం.. రెండో ఓవర్లోనే.. - టీమ్ఇండియా బంగ్లాదేశ్ రెండో వన్డే
టీమ్ఇండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం జరుగుతున్న రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. దీంతో మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్‌ను వీడాల్సి వచ్చింది.
చేతుల్లో వాలుతున్న బంతిని అందుకోవడంలో చాలా లేటుగా రియాక్ట్ అయిన రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ చేయడమే కాకుండా చేతిని బలంగా నేలకు తాకించుకున్నాడు. అతడి బొటని వేలికి గాయమైంది. రక్తం కూడా వచ్చినట్లు తెలిసింది. వెంటనే ఫిజియో వచ్చి అతడికి చికిత్స అందించాడు. ఆ తర్వాత గాయం తీవ్రత తెలుసుకునేందుకు అతడిని స్కానింగ్‌కు పంపించారు వైద్యులు. ఎక్స్‌రే రిపోర్ట్‌ను బట్టి బీసీసీఐ తదుపరి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. దీంతో హిట్‌మ్యాన్ స్థానంలో రజత్ పటిదార్... సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్‌కి వచ్చాడు. కెప్టెన్ గాయపడడంతో కెఎల్ రాహుల్, స్టాండ్ బౌ కెప్టెన్‌గా నిలిచాడు.
ఇదీ చూడండి:ఐపీఎల్ ఫైనల్ విషయంలో బీసీసీఐకి కొత్త చిక్కు.. ఏంటంటే?