Rohith Sharma Bowling ODI World Cup 2023 : వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా.. గురువారం(అక్టోబర్ 19) బంగ్లాదేశ్ మ్యాచ్ ఆడనుంది టీమ్ఇండియా. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు భారత జట్టు నెట్స్‌లో శ్రమిస్తూ కనిపించింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ప్రధాన పేసర్లు బుమ్రా, మహ్మద్ సిరాజ్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తదితరులు నెట్స్‌లో శ్రమించారు.
రన్‌మెషీన్ కోహ్లీ ల్యాప్, స్వీప్ షాట్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించగా.. కెప్టెన్ హిట్ మ్యాన్ బంతితో రంగంలోకి దిగడం విశేషం. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మార్గదర్శకంలో రోహిత్ బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు ఫొటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. బంగ్లాదేశ్ జట్టు నలుగురు ఎడమచేతి వాటం గల బ్యాటర్లతో ఆడుతున్న నేపథ్యంలో.. అదనపు స్పిన్నర్ అవసరం లేకుండా టీమ్ఇండియా ప్రణాళికలను రచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ బంగ్లాతో మ్యాచ్‌లో తుది జట్టులో లేకపోతే.. రోహిత్ బౌలింగ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే పార్ట్ టైమ్ బౌలర్ అయిన రోహిత్ శర్మ.. ఐపీఎల్లో హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. అయితే భుజానికి గాయమైనప్పటి నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అతడు ఇప్పటివరకు బౌలింగ్ చేసిన సందర్భాలు ఎక్కడా కనిపించలేదు. వన్డేల్లో చివరిగా పెర్త్ వేదికగా 2016లో ఆస్ట్రేలియాపై హిట్‌మ్యాన్ బౌలింగ్ చేశాడు. అయితే, 2021లో ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. టీ20లలో ఆఖరిగా 2012లో బంతులను సంధించాడు.