Rohit - Virat T20 Career :వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత అందరి మదిలో ఒకటే ప్రశ్న. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రొఫెనషల్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని. అయితే వీరిద్దరూ వయసు రీత్య 2027 వన్డే వరల్డ్‌కప్ భారత్ జట్టులో ఉండడం కష్టమేని కథనాలు వస్తున్న నేపథ్యంలో.. టీ20ల విషయం చర్చనీయాంశమైంది. 2024 టీ20 వరల్డ్‌కప్‌నకు కేవలం ఏడు నెలల సమయం మాత్రమే ఉండడం వల్ల ఇప్పుడు టీమ్ఇండియాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
అయితే 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత.. రోహిత్ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అటు విరాట్‌ది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో రోహిత్, విరాట్ ఇక టీ20లకు త్వరలోనే గుడ్‌బై చెప్పవచ్చని కథనాలు వెలువడుతున్నాయి. కానీ, వీరిద్దరు టీ20 ఫార్మాట్ రిటైర్మెంట్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. టీ20ల్లో ఆడటంపై వారే స్వయంగా నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ బీసీసీఐ కల్పించిందట! దీంతో రానున్న రోజుల్లో వీరి నిర్ణయాలు ఎలా ఉండనున్నాయో అని ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఇక రోహిత్ - విరాట్ 2024 టీ20 వరల్డ్‌కప్‌లో కచ్చితంగా ఉండాలని.. మళ్లీ వీరిద్దరు కలిసి ఆడితే చూడాలనుందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
Rohit Sharma T20 Stats : రోహిత్ శర్మ కెరీర్లో 148 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో నాలగు సెంచరీలతో సహా 3853 పరుగులు చేశాడు. ఇక టీ20ల్లో నాలుగు సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా రోహిత్ రికార్డు కొట్టాడు. అలాగే టీ20ల్లో అత్యధిక పరుగులు బాదిన జాబితాలో విరాట్ తర్వాతి స్థానం రోహిత్‌దే.