తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రోహిత్​కు కెప్టెన్సీ ఇవ్వాల్సింది కాదు'.. యువీ సంచలన వ్యాఖ్యలు

Rohit test captaincy Yuvraj: టీమ్ఇండియా ప్రధాన బ్యాటర్ రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్​గా ఎంపిక చేయడం ఎమోషనల్ నిర్ణయమని మాజీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ వయసుతో పాటు అతడి గాయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ROHIT TEST CAPTAIN yuvraj
ROHIT TEST CAPTAIN yuvraj

By

Published : Apr 30, 2022, 12:51 PM IST

Rohit test captaincy Yuvraj: టెస్టు కెప్టెన్​గా రోహిత్ శర్మను నియమించడంపై యువరాజ్​ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ సెలెక్టర్లు ఎమోషనల్​గా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నాడు. రోహిత్​ను టెస్టు కెప్టెన్​గా నియమించిన సమయంలోనూ అతడు ఫిట్​నెస్ సమస్యలు ఎదుర్కొన్నాడని గుర్తు చేశాడు. అలాంటి ఆటగాడిని టెస్టు సారథిగా నియమించకూడదని అభిప్రాయపడ్డాడు.

Rohit fitness Yuvraj news:'అది భావోద్వేగపరమైన నిర్ణయమని నా అభిప్రాయం. అతడు ఎక్కువగా గాయాలపాలవుతున్నాడు. ఈ వయసులో శరీరాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అలాంటి ఆటగాడిని టెస్టు సారథిగా నియమించకూడదు. ఇది అతడి సారథ్యంపైనా ప్రభావం చూపుతుంది. టెస్టు మ్యాచ్​లలో రోహిత్ శర్మ ఓపెనింగ్​ స్థానంలో ఆడటం ప్రారంభించి రెండేళ్లే అవుతోంది. అతడు బాగా ఆడుతున్నాడు. అతడి దృష్టి బ్యాటింగ్​పై ఉంచుకోవాలి. కానీ, ఐదు రోజులు గ్రౌండ్​లో నిల్చోవడం కష్టం' అని యువీ చెప్పుకొచ్చాడు.

Rohit captaincy records:అయితే, పొట్టి ఫార్మాట్​లో రోహిత్ అద్భుతమైన ఆటగాడని యువరాజ్ అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్​లో అతడికి ముందుగానే టీమ్ఇండియా సారథ్యం లభించాల్సిందని అన్నాడు. 'అతడు గొప్ప నాయకుడు. ముంబయి ఇండియన్స్​లో నేను అతడి సారథ్యంలోనే ఆడా. అతడు బాగా ఆలోచిస్తాడు. మంచి కెప్టెన్. పరిమిత ఓవర్ల క్రికెట్​లో అతడు ఎప్పుడో సారథి కావాల్సింది. కానీ విరాట్ కోహ్లీతో పాటు జట్టు కూడా అద్భుతంగా రాణించిన నేపథ్యంలో అది సాకారం కాలేదు' అని యువీ వివరించాడు.

ఈ ఏడాది జరిగిన దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ అనంతరం టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. అప్పటికే వన్డే, టీ20 కెప్టెన్​గా రోహిత్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలోనే టెస్టు కెప్టెన్సీనీ అతడికే అప్పగించింది బీసీసీఐ. అయితే, రోహిత్​కు అప్పుడు 34 ఏళ్లు. గాయాల వల్ల గత రెండేళ్లలో కీలక సిరీస్​లకు రోహిత్ దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి బదులు మరో ఆటగాడిని టెస్టు సారథిగా ఎంపిక చేయాల్సిందని అప్పుడే పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే, పొట్టిఫార్మాట్​లో తన నాయకత్వ పటిమను రుజువు చేసుకున్న రోహిత్​కే పగ్గాలు అప్పగించారు సెలెక్టర్లు.

ఇదీ చదవండి:

IPL 2022: కోహ్లీ, రోహిత్​ వైఫల్యానికి కారణాలివేనా?

IPL 2022: అది ఉంటే ఎలాంటి మ్యాచ్​నైనా గెలవచ్చు!

ABOUT THE AUTHOR

...view details