Rohit Sharma Virat Kohli vs Srilanka :2023 ప్రపంచకప్‌లో భాగంగా నవంబర్ 2 గురువారం భారత్.. శ్రీలంకను ఢీకొట్టనుంది. ఈ మెగా సమరానికి ముంబయి వాఖండే స్టేడియం వేదిక కానుంది. అయితే ప్రస్తుత టోర్నీలో టీమ్ఇండియా అదరగొడుతోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. అన్నీ తామై బ్యాటింగ్ బాధ్యతలు మోస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ.. టోర్నీలో చెరో శతకం బాది మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే వీరి ఫామ్ టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్నిస్తుంటే.. శ్రీలంక బౌలర్లను మాత్రం ఆందోళనలోకి నెట్టేస్తుంది. శ్రీలంకపై వీరి రికార్డులు అలా ఉన్నాయి మరి. ప్రపంచంలోనే శ్రీలంకపై ఏ బ్యాటర్ సాధించలేని ఘననలు వీరిద్దరూ నమోదు చేశారు. మరి ఆ రికార్డులేంటంటే..?
విరాట్ వర్సెస్ శ్రీలంక..విరాట్ కోహ్లీ కెరీర్ ఆరంభం నుంచే.. శ్రీలంక బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఏ బ్యాటర్‌కు సాధ్యం కాని రీతిలో శ్రీలంకపై వన్డేల్లో.. ఏకంగా 10 శతకాలు నమోదు చేశాడు. వన్డేల్లో ఒక దేశంపై అత్యధిక సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గానూ విరాట్ రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో 52 మ్యాచ్‌ల్లో విరాట్ 2506 పరుగులు బాదాడు. ఈ లిస్ట్‌లో సచిన్ తెందూల్కర్ 3113 పరుగులతో టాప్‌లో ఉన్నాడు.