టీమ్ఇండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టిన రోజు సందర్భంగా పలువురు క్రికెటర్లు అతనికి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ క్రికెటర్ సురేశ్ రైనా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, హర్భజన్ సింగ్, దినేష్ కార్తీక్.. తమదైన శైలిలో బర్త్‌డే విషెస్ చెప్పారు.
నేడు 34వ పడిలోకి అడుగుపెట్టాడు హిట్‌మ్యాన్. ప్రస్తుతం ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందిన జట్టులో రోహిత్ సభ్యుడు.