Rohit Sharma T20 World Cup : మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది టీమ్ఇండియా. జనవరి 11 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దీని కోసం జట్టు ఎంపిక చేసేందుకు బీసీసీఐ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు ఎలా ఉండనుందో అని క్రికెట్ లవర్స్‌లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సిరీస్‌లో ఎంపికను బట్టే జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ తుది జట్టును ఎంపిక చేస్తారు. దీంతో ప్లేయర్ల అవకాశాలపై పలు ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి.
మరోవైపు అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ జట్టు ఎంపికకు తాము కూడా అందుబాటులో ఉంటామంటూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తాజాగా బీసీసీఐకి సమాచారం అందించారు. దీన్ని బట్టి వీరిద్దరూ టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు సముఖంగానే ఉన్నారని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ జట్టులో వీరి అవకాశాలపై కూడా క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతోంది. ఇదే అంశంపై తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. టీ20 వరల్డ్‌కప్ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మనే బీసీసీఐ నియమించి, విరాట్ కోహ్లీని పక్కకు పెట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. కీపర్‌గా కేఎల్ రాహుల్ జట్టులోకి తీసుకుని మిడిలార్డర్లో బ్యాటింగ్ ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందట. ఇక స్టార్ టీ20 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌ను వన్‌డౌన్ పొజిషన్‌కు తీసుకోవాలని క్రికెట్ బోర్డు యోచిస్తున్నట్లు టాక్.