Rohit Sharma T20 World Cup : 14 నెలలుగా ఇంటర్నేషనల్ టీ20ల్లో ఆడలేదు, పైగా పొట్టి ఫార్మాట్లో రోహిత్ శర్మకు నిలకడ ఉండటం లేదనే విమర్శలు. మరోవైపు టీ20 వరల్డ్ కప్ దిశగా యంగ్ టీమ్‌ను సిద్ధం చేస్తున్నారు, అలానే టీమ్‌ను నడిపించేందుకు ఓ యంగ్ కెప్టెన్‌నూ తీర్చిదిద్దుతున్నారు. మరి ఇలాంటి సమయంలో రోహిత్ శర్మను మళ్లీ టీ20 జట్టులోకి తీసుకురావడం, పైగా కెప్టెన్సీ ఇవ్వడంతో ఓ వర్గం నుంచి విమర్శలు బాగా వచ్చాయి.
ఈ క్రమంలోనే రీసెంట్గా అఫ్గానిస్థాన్‌తో(IND VS AFG T20 Series) జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ అతడు డకౌట్ అవ్వడం వల్ల ఆ విమర్శలు మరీ ఎక్కువైపోయాయి. కానీ ఆ తర్వాత ఒకే ఒక్క ఇన్నింగ్స్, ఒకే ఒక్క మ్యాచ్‌తో అతడిపై ఉన్న అనుమానాలన్నీంటినీ తొలగిపోయేలా చేసింది. ఇది కదా రోహిత్ అంటే అని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
అఫ్గానిస్థాన్‌తో జరిగిన చివరి(మూడో) టీ20తో రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఆడిన తీరు చూస్తే కొత్త వెర్షన్ అనే చెప్పాలి. అసలు టీ20లు ఆడతాడో, లేదో అన్న సందేహాలను దాటి ఇప్పుడు పొట్టి వరల్డ్ కప్ జట్టును నడిపించేలా ముందుకు సాగుతున్నాడు. అఫ్గాన్‌తో మూడో టీ20లో ఓ వైపు బ్యాట్‌తో, మరోవైపు కెప్టెన్సీతో అదరగొట్టాడు. 4 వికెట్లు కోల్పోయి ఓటమి ప్రమాదంలో ఉన్న జట్టుకు వీరోచిత శతకంతో విజయాన్ని అందించాడు.
మరో వికెట్ పడకుండా జట్టు 212 పరుగులతో ఇన్నింగ్స్ ముగించుకుందంటే అందుకు కారణం రోహితే. రింకు సింగ్‌తో కలిసి అతడు ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరు, చివర్లో ధనాధన్ షాట్లు బాదిన వైనం, టీ20ల్లో ఒకప్పటి రోహిత్‌ను గుర్తుచేసిందనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే వన్డేల్లో రోహిత్‌కు తిరుగులేకపోయినా, టీ20ల్లో మాత్రం నిలకడ లేదనే వాదన ఉంది. ఇప్పుడీ మ్యాచ్‌తో రోహిత్ 2.0 అని అనిపించుకుంటున్నాడు. తనవి కాని స్విచ్ షాట్లను కూడా అద్భుతంగా ఆడాడు. అసాధాణ రీతిలో సెంచరీ బాదాడు.
Rohit sharma T20 Century : ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక శతకాల(5) రికార్డు రోహిత్‌దే. రెండు సూపర్ ఓవర్లలోనూ అదరగొట్టాడు. మొదట రెండు సిక్సర్లు, తర్వాత ఓవర్లో సిక్స్, ఫోర్ బాదాడు. తొలి సూపర్ ఓవర్లో లాస్ బాల్‌కు బౌలింగ్ ఎండ్‌లో ఉన్న అతడు, రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి వేగంగా పరుగెత్తడం కోసం రింకు సింగ్‌ను పిలిపించడం అతడి తెలివికి నిదర్శనం అని చెప్పాలి. రెండో సూపర్ ఓవర్లోనూ పేసర్ అవేశ్‌ను కాదని, మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చిన స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు బంతిని అప్పజెప్పడం అతడి తెలివికి నిదర్శనం. ఫలితంగా మ్యాచ్ సొంతమైంది. ఇలాగే టీ20 వరల్డ్ కప్‌లోనూ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రోహిత్ అదరగొడితే ఐసీసీ ట్రోఫీల నిరీక్షణకు తెరపడినట్టే! బీసీసీసీ ఈ ప్రపంచకప్‌లో అతడికే పగ్గాలు అప్పజెప్పాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
సూపర్ ఓవర్లో రోహిత్ 'స్మార్ట్‌నెస్'- రూల్స్ ప్రకారం కరెక్టే!- కోచ్‌కు తెలియాలి కదా!
విరాట్ 'సూపర్ మ్యాన్ ఫీట్'- 5 పరుగులు సేఫ్- మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే!