Rohit Sharma T20 World Cup 2024 :ఇటీవలే జరిగిన వన్డే ప్రపంచకప్‌తో టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు ముగిశాయి. అయితే వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ మరోసారి ద్రవిడ్‌కు పగ్గాలు అప్పజెప్పింది. అయితే టీ20 ప్రపంచకప్ వరకు మాత్రమే కాకుండా కోచ్‌గా మరికొంతకాలం అతడు ఉండేలా చూసుకోవాలని బీసీసీఐ గట్టి ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని పొడగించనున్నట్లు బీసీసీ సెక్రటరీ జై షా వెల్లడించాడు. అయితే ప్రస్తుతం ద్రవిడ్ సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నందున అది ముగిసిన తర్వాతనే అతడితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జై షా పేర్కొన్నాడు.
మరోవైపు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కూడా జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. రానున్న టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ ఆడుతాడా లేదా అన్న విషయం గురించి గ్యారెంటీ ఇవ్వలేమని జైషా తెలిపాడు. ఇప్పుడు ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు? ''జూన్ లో టీ20 ప్రపంచకప్ జరుగుతుంది. అంతకంటే ముందు ఐపీఎల్, అఫ్గానిస్థాన్‌తో సిరీస్ ఉంటాయి. అప్పటిలోపు ఓ మంచి నిర్ణయం తీసుకుంటాం'' అని జైషా పేర్కొన్నాడు.
మరోవైపు హార్దిక్ పాండ్య, మహ్మద్ షమి హెల్త్ అప్డేట్ ఇచ్చారు. "ప్రస్తుతం హార్దిక్ ఎన్సీఏ పర్యవేక్షణలో ఉన్నాడు. అతడు కోలుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న సిరీస్ కంటే ముందే హార్దిక్ కోలుకుంటాడు. షమి అయితే సౌతాఫ్రికా సిరీస్ కోసం సిద్ధంగా ఉన్నాడు. త్వరలో అతడు ఎన్సీఏకి వెళ్తాడు. త్వరలోనే అతడు కూడా కోలుకుంటాడు'' అని జై షా అన్నారు.