Rohit Sharma T20 Record :టీమ్ఇండియా స్టార్ క్రికెటర్, కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. 14 నెలల తర్వాత పొట్టి ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన హిట్‌మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 150 టీ20లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించనున్నాడు. ఇప్పటివరకు ఈ ఫార్మాట్లో 149 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్ అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగే రెండో టీ20తో ఈ ఘనత అందుకోనున్నాడు. ఇప్పటికే ఈ లిస్ట్‌లో విరాట్ కోహ్లీ 115 మ్యాచ్‌లతో 11వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
అత్యధిక టీ20లు ఆడిన టాప్ 10 ప్లేయర్స్ ఎవరంటే ?
రోహిత్ శర్మ (భారత్) - 149
పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్) - 134
జార్జ్ డాక్రెల్ (ఐర్లాండ్) - 128
షోయబ్ మాలిక్ (పాకిస్థాన్) - 124
మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్) - 122
మహ్మదుల్లా (బంగ్లాదేశ్) - 121
మహ్మద్ హఫీజ్ (పాకిస్థాన్) -119
టిమ్ సౌథీ (న్యూజిలాండ్) - 118
షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) - 117
డేవిడ్ మిల్లర్ - 116
IND VS AFG Rohit Sharma T20 Win Record : మరోవైపు ఇటీవలే అఫ్గాన్‌తో జరిగిన తొలి టీ20లో రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 విజయాల్లో భాగమైన తొలి పురుష క్రికెటర్‌గా ప్రపంచ రికార్డులో నిలిచాడు. గురువారం మొహాలీ వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు విజయం సాధించడం ద్వారా హిట్ మ్యాన్ ఖాతాలోకి ఈ రికార్డు వచ్చి చేరింది. రోహిత్ ఈ మార్క్‌ను కేవలం 149 మ్యాచ్‌ల్లోనే అందుకున్నాడు. అసలీ మ్యాచ్‌లో రోహిత్ ఖాతా తెరవకుండానే ఔటైనా అతడి ఖాతాలో వరల్డ్ రికార్డు చేరడం విశేషం. మొత్తంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాల్లో భాగమైన రికార్డు ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డ్యానీ వ్యాట్ పేరిట ఉంది. ఆమె 111 టీ20 విజయాల్లో భాగమైంది. పురుషుల క్రికెట్‌లో హిట్ మ్యాన్ తర్వాత ఈ అత్యధిక విజయాల రికార్డు పాక్ ప్లేయర్ షోయబ్ మాలిక్ పేరిట ఉంది. అతడు 124 మ్యాచ్‌ల్లో 86 విజయాలు సాధించాడు.
ఇక రోహిత్ తర్వాత భారత్ తరఫున అత్యధిక టీ20 విజయాల్లో భాగమైన ఘనత విరాట్ కోహ్లీది. విరాట్ 115 మ్యాచ్‌ల్లో 73 విజయాలను సొంతం చేసుకున్నాడు. దీంతో అంతర్జాతీయ టీ20 విజయాల్లో విరాట్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ జాబితాలో మహమ్మద్ హఫీజ్, మహమ్మద్ నబీలు చెరో 70 విజయాతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ఈ మ్యాచ్ విజయం సాధించడం ద్వారా హిట్‌మ్యాన్ కెప్టెన్‌గానూ ఓ అరుదైన గుర్తింపును సాధించాడు. హిట్‌మ్యాన్ సారథ్యంలో భారత జట్టు కేవలం 52 మ్యాచ్‌ల్లోనే 40 విజయాలను దక్కించుకోవడం విశేషం.
కన్ఫ్యూజైన రోహిత్- పాపం కుల్దీప్ను మర్చిపోయాడుగా
అందుకే గిల్‌పై ఫైర్ అయ్యాను : రోహిత్ శర్మ