శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తన హిట్టింగ్ పవర్ చూపించాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న రోహిత్.. ఓవరాల్‌గా 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ అరుదైన రికార్డులు అందుకున్నాడు. ఆసియాకప్ టోర్నీలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకుని టీమ్ఇండియా తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఆసియాకప్‌లో భారత్ తరపున సచిన్ 971 పరుగులు) తొలి స్థానంలో ఉండగా.. తాజాగా రోహిత్ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు.
ఆసియాకప్‌లో రోహిత్ శర్మ ఘనత.. సచిన్ రికార్డు బద్దలు - ఆసియా కప్ రోహిత్ వెయ్యి పరుగులు
ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులు సాధించాడు. ఆ రికార్డులేంటో చూద్దాం..
టీమ్ఇండియా తరఫున 1016 పరుగులతో తొలి స్థానంలో ఉన్న రోహిత్.. ఓవరాల్‌గా ఆసియాకప్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో సనత్ జయసూర్య 1220 పరుగులు.. కుమార సంగక్కర 1075 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆసియాకప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. అంతకముందు షాహిద్ అఫ్రిదితో కలిసి 40 సిక్సర్లతో సంయుక్తంగా ఉన్న రోహిత్ తాజాగా తొలి స్థానంలో నిలిచాడు.
ఇదీ చూడండి: పాపం కోహ్లీ.. ఓటమికి కారణాలు చెప్పిన కెప్టెన్ రోహిత్