Rohit Sharma South Africa Series : సాతాఫ్రికాలోని సెంచూరియన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైన టీమ్ఇండియా నిర్దిష్ట ఓవర్లసకు 245 చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు రెండో రోజు ఆట ముగిసే సమయానికి అయిదు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేశారు. దీంతో సౌతాఫ్రికా 11 తేడాతో పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
దీంతో ఇప్పుడు టీమ్ఇండియా పర్ఫామెన్స్పై మాజీలు మండిపడుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ పేలవ ప్లాన్స్ వల్ల ఇదంతా జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మ్యాచ్‌లో బౌలర్లను ఉపయోగించిన తీరు నిరాశగా ఉందంటూ చెప్పుకుంటున్నారు. లంచ్ బ్రేక్‌లో కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రస్తుతం టీమ్ఇండియా ఇబ్బందుల్లో పడుతోందంటూ మండిపడుతున్నారు.
''ఏ సెషన్ ప్రారంభంలో అయినా మొదట అత్యుత్తమ బౌలర్లతో ప్రత్యర్థులపై దాడి చేసేందుకు ప్రయత్నించాలి. నేను కోచ్‌గా ఉన్నప్పుడు మేం ఇదే విషయాన్ని చాలా సార్లు చర్చించుకున్నాం. కానీ ఈ సారి రోహిత్ అలా చేయలేదు. లంచ్ బ్రేక్ తర్వాత శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణలను బౌలింగ్‌కు దింపాడు. వీరిద్దరితో బౌలింగ్ స్ట్రాటజీ ప్లాన్ చేయడం వ్యూహాత్మకంగా అతి పెద్ద తప్పు. ఇలా చేసి ఉండకపోతే భారత్ ఆ సెషన్ తొలి అరగంటలోనే పైచేయి సాధించేది'' అని రవిశాస్త్రి తన అభిప్రయాన్ని వెల్లడించాడు.