టీమిండియా ఓపెనర్, ముంబయి ఇండియన్స్ సారథి 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మకు తన కూతురు సమైరా అంటే ఎంతో ఇష్టం. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సమైరాతో సరదాగా గడపటానికి ప్రాధాన్యమిస్తాడు రోహిత్. అందుకే టీమిండియా, ఐపీఎల్ మ్యాచులు ఉన్న సమయంలో రోహిత్ తనతో పాటు భార్య రితికా సజ్డెదీ, కూతురు సమైరాను వెంట తీసుకెళ్తాడు. తన కూతురుతో ఆడుకుంటున్న వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంటాడు హిట్‌మ్యాన్.
'ఆడపిల్ల తండ్రిగా నేనెంతో గర్వపడుతున్నా!' - రోహిత్ శర్మ సమైరా
టీమ్ఇండియా వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మకు తన కుమార్తె సమైరా అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీమ్ఇండియా పర్యటనలతో పాటు ఐపీఎల్ మ్యాచ్‌లకూ తన భార్యతో పాటు కూతుర్ని తోడుగా తీసుకెళ్తాడు హిట్‌మ్యాన్. తన కుమార్తె ఫొటోలను తరచుగా షేర్ చేసే రోహిత్.. ఆడిపిల్లకు తండ్రిగా తానెంతో గర్వపడుతున్నట్లు పేర్కొన్నాడు.
'ఆడపిల్ల తండ్రిగా నేనెంతో గర్వపడుతున్నా!'
గురువారం కూడా తన గారాలపట్టి సమైరాను భుజాలపై ఎత్తుకుని ఉన్న ఫొటోను రోహిత్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ 'ఆడపిల్ల తండ్రిగా గర్వపడుతున్నా' అనే వ్యాఖ్యను జోడించాడు. ఈ పోస్టుకు కొన్ని గంటల్లోనే సుమారు 8 లక్షల లైక్‌లు వచ్చాయి. 2015లో తన చిన్న నాటి స్నేహితురాలు రితికా సజ్దెదీని రోహిత్ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు 2018లో సమైరా జన్మించింది.
ఇదీ చూడండి..జాతీయ క్రీడా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
Last Updated : May 20, 2021, 10:49 PM IST