తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​కే టీ20 పగ్గాలు.. సిరీస్​కు కోహ్లీ దూరం - ind vs nz test series

న్యూజిలాండ్​తో సిరీస్​ కోసం టీ20 స్క్వాడ్​ను ప్రకటించింది బీసీసీఐ. కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్​ శర్మకు అప్పగించింది.

rohit sharma, kohli
రోహిత్ శర్మ, కోహ్లీ

By

Published : Nov 9, 2021, 7:52 PM IST

Updated : Nov 9, 2021, 8:38 PM IST

న్యూజిలాండ్​తో సిరీస్​ నేపథ్యంలో టీ20 జట్టును ప్రకటించింది బీసీసీఐ. రోహిత్​ శర్మ సారథ్యంలో టీమ్​ఇండియా కివీస్​​తో తలపడనుంది. కేఎల్​ రాహుల్​ను వైస్​ కెప్టెన్​గా ఎంపిక చేసింది. ఈ సిరీస్​కు కోహ్లీ దూరమయ్యాడు. దిగ్గజ క్రికెటర్​ రాహుల్​ ద్రావిడ్​ హెడ్​కోచ్​గా టీమ్​ఇండియాకు తొలి సిరీస్​ ఇదే కావడం విశేషం.

టీమ్​ఇండియా టీ20 స్క్వాడ్:

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.

భారత్, కివీస్​ మధ్య టీ20 సిరీస్ నవంబర్ 17-21 మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ జైపూర్(నవంబర్ 17), రెండో మ్యాచ్ రాంచీ(నవంబర్ 19), మూడో మ్యాచ్ కోల్​కతా(నవంబర్ 21) వేదికగా జరగనున్నాయి.

అనంతరం భారత్​తో టెస్టు మ్యాచ్​లు ఆడనుంది కివీస్. నవంబర్ 25-29 మధ్య కాన్పుర్​లో తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య ముంబయి వేదికగా రెండో టెస్టు జరగనుంది.

దక్షిణాఫ్రికా టూర్..

దక్షిణాఫ్రికా టూర్​కు వెళ్లనున్న టీమ్​ఇండియా ఏ జట్టును కూడా ప్రకటించింది బీసీసీఐ. నవంబర్ 23- డిసెంబర్ 9 వరకు ఇరు జట్ల మధ్య మ్యాచ్​లు జరగనున్నాయి.

టీమ్​ఇండియా ఏ స్క్వాడ్:

ప్రియాంక్ పంచల్(కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, దేవ్​దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, బాబా అపరంజిత్, ఉపేంద్ర యాదవ్(వికెట్ కీపర్), కే గౌతమ్, రాహుల్ చహర్, సౌరభ్ కుమార్, నవ్​దీప్ సైని, ఉమర్ మాలిక్, ఇషాన్ పోరెల్, అర్జన్ నాగ్వస్​వల్ల.

ఇదీ చదవండి:

భారత్- పాక్ మ్యాచ్​కు అదిరిపోయే 'వ్యూస్'.. టీ20 చరిత్రలోనే..

Last Updated : Nov 9, 2021, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details