టీ20 ప్రపంచకప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన టీమ్ఇండియా.. నెదర్లాండ్స్‌తో రెండో మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌లో అదరగొట్టిన కోహ్లీ.. ఈ రెండో మ్యాచ్‌లోనూ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తాడని ఆశిస్తున్నారు. అయితే అదే సమయంలో కేప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఘోరంగా విఫలమయ్యాడు.
దీంతో రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలి ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది. దీనిపై అతడి చిన్నప్పటి కోచ్ దినేశ్ లాడ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ కొంతకాలం ఇన్నింగ్ ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుందని, పవర్ ప్లేలో అతడి అవసరం జట్టుకు ఉందని అభిప్రాయపడ్డారు. తన సహజ శైలిలో ఆడాలని సూచించాడు. ప్రస్తుతం రోహిత్ హైరిస్క్ గేమ్ ఆడుతున్నాడని వ్యాఖ్యానించారు. అలా ఆడటం సరైనది కాదని, అతను ఎందుకు అలా చేస్తున్నాడో తనకు తెలియట్లేదని పేర్కొన్నారు. ఓవర్ అగ్రెసివ్‌గా ఆడాలనుకోవడం వల్లే రోహిత్ శర్మ తప్పులు చేస్తోన్నాడనిపిస్తోందని చెప్పారు.
"అతను చాలా కాలంగా హై-రిస్క్ గేమ్‌ను ఆడుతున్నాడు. ఎందుకలా ఓవర్ అగ్రెసివ్‌గా ఆడుతున్నాడో తెలియడం లేదు. క్రీజ్‌లో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నా. అనవసరంగా వికెట్ పారేసుకుంటున్నాడు. పవర్‌ప్లేలోని మొదటి ఆరు ఓవర్లలో అతడు ఛాన్స్‌లు తీసుకోకూడదు. 17-18 ఓవర్లు ఆడటానికి ప్రయత్నించాలి. అలా ప్రతి మ్యాచ్‌లోనూ 70 నుంచి 80 పరుగులు చేయాలి. అతడి ఆట విధానంలో మార్పు రావాలి. విఫలమైన ఆటగాడిలా కూకుండా అతడిని యాంకర్‌గా చూడాలనుకుంటున్నాను. అతడు ఎక్కువ సేపు క్రీజులో ఉంటే జట్టుకు అవసరమయ్యేలా ఎక్కువ స్కోరు చేస్తాడు. అతడు ఎక్కువ గాల్లోకి బాదుతాడు ఎందుకంటే టీ20లో అది అవసరం. కానీ నేను చెప్పేది ఏంటంటే కంట్రోల్డ్‌గా ఆచితూచి ఆడాలి. రిస్కీ షాట్స్‌ను ఆపితే మంచితే. అప్పుడు ప్రతి మ్యాచ్‌లోనూ బాగా రాణించొచ్చు. ఏదేమైనప్పటికీ అతడు త్వరలోనే తిరిగి ఫామ్‌లోకి వస్తాడని భావిస్తున్నాను. అతడు కాస్త సహనంగా ఉండాలి. ఆస్ట్రేలియాలోని పిచ్‌లు అతడి ఆటకు సరిగ్గా సరిపోతాయి. అతడు మంచి స్ట్రోక్ ప్లేయర్. రోహిత్ ఆటను ఆస్వాదించేలా ఆడటం ప్రారంభించాలి. అప్పుడే ఓ ప్లేయర్‌గా కెప్టెన్‌గా దేశానికి గర్వకారణం అవుతాడు. అతడు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అతడు ఎంట్రీ ఇచ్చినప్పుడు 2007 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా విజయం సాధించింది. ఇప్పుడతడు కెప్టెన్‌గా ట్రోఫీని ముద్దాడం చూడాలనుకుంటున్నాను" అని దినేశ్ అన్నారు.
ఇదీ చూడండి:ఓహో.. ఇదా సూర్యకుమార్ సూపర్ షాట్స్ టెక్నిక్