అనుకున్నట్టే జరిగింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో బొటన వేలికి గాయమైన కెప్టెన్ రోహిత్ ఇంకా కోలుకోలేదు. అతడు ఇంకా నొప్పితో బాధపడుతున్నాడట. దీంతో బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకూ దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇక రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ సారథిగా కొనసాగుతాడు. త్వరలోనే స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని రోహిత్‌కు మరింత విశ్రాంతి ఇచ్చేందుకే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
అనుకున్నట్టే జరిగింది... హిట్‌మ్యాన్‌తో పాటు అతడు కూడా..
గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు బంగ్లాతో జరగబోయే రెండో టెస్టుకు దూరంకానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే హిట్‌మ్యాన్‌తో పాటు మరో కీలక ప్లేయర్ కూడా అందుబాటులో ఉండడని తెలిపారు.
"రోహిత్ ఫుల్ ఇంటెన్సిటీతో ఆడేందుకు మరింత విశ్రాంతి అవసరమని బీసీసీఐ మెడికల్ టీమ్ చెప్పింది. అతడి ఇంకొన్ని చికిత్స అవసరం. అందుకే రెండో టెస్టుకు కూడా అతడు అందుబాటులో ఉండట్లేదు." అని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. కాగా, హిట్‌మ్యాన్‌తో పాటు పేసర్ నవదీప్ సైనీ కూడా రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండట్లేదని తెలిపింది బోర్డు. అతడికి కడుపులో ఏదో సమస్య ఉందని చెప్పింది.
ఇదీ చూడండి:దడ పుట్టించిన స్టోక్స్.. 39ఏళ్ల రికార్డు బద్దలు.. ఇంగ్లాండ్ చేతిలో పాక్ క్లీన్ స్వీప్