దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు రోహిత్ దూరం.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ - టీమ్ఇండియా న్యూ కెప్టెన్
20:42 December 31
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు జట్టు ప్రకటన
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అభిమానులకు నిరాశ. తొడ కండరాల పట్టేయడం వల్ల దక్షిణాఫ్రికాతో టెస్టులకు దూరమైన అతడు.. ఇప్పుడు వన్డే సిరీస్‌లోనూ ఆడటం లేదు. దీంతో కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు అందుకునేందుకు మరింత సమయం పట్టేలా ఉంది.
రోహిత్ దూరమవడం వల్ల ఈ వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ, 18 మందితో కూడిన జట్టును ప్రకటించారు. పేసర్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా నియమించారు. జనవరి 19,21,23 తేదీల్లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి.
టీమ్ఇండియా జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా(వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దుల్ ఠాకుర్, సిరాజ్