Rohit Sharma Practice Photo : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో చెమటోడ్చాడు. గ్రౌండ్‌లో పరుగులు తీస్తూ ఫిట్‌గా కనిపించిన హిట్‌మ్యాన్.. ఆసియా వన్డే కప్ టోర్నీకి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు కనిపించాడు. కాగా వెస్టిండీస్ పర్యటనలో చివరిగా రోహిత్ వన్డే మ్యాచ్ ఆడాడు. విండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్ భారత్‌కు 1-0తో ట్రోఫీని అందించాడు.
కెప్టెన్సీతో అదరగొట్టిన రోహిత్..
Rohit Sharma West Indies Tour :ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు రోహిత్. తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్ తర్వాత రోహిత్‌తో పాటు టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి కూడా మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్య సారథ్యంలో మిగిలిన రెండు వన్డేల్లో ఒకటి గెలిచిన టీమిండియా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
హిట్‌మ్యాన్ ఫిక్స్ వైరల్..
విండీస్ టూర్ తర్వాత కెప్టెన్ రోహిత్, కోహ్లీ భారత్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆగస్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికగా ఆరంభం కానున్న ఆసియా కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో దొరికిన విరామ సమయాన్ని రోహిత్ శర్మ ప్రాక్టీస్ కోసం కేటాయించాడు. మైదానంలో కసరత్తులు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హిట్‌మ్యాన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇందులో టీ షర్ట్, షార్ట్, జాగింగ్ షూ వేసుకుని రోహిత్ స్టైలిష్‌గా కనిపించాడు.