తెలంగాణ

telangana

ETV Bharat / sports

సిక్స్​ కొడితే రోహిత్ రికార్డు​.. సిరీస్​ క్లీన్​స్వీప్​ చేస్తే అరుదైన ఘనత​ - రోహిత్ శర్మ

Rohit sharma: వెస్టిండీస్​పై మూడో వన్డే గెలిస్తే.. టీమ్​ఇండియా ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరుతుంది. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకొక సిక్స్​ బాదితే సరికొత్త ఘనత సొంతం చేసుకుంటాడు.

rohit sharma
రోహిత్​ శర్మ

By

Published : Feb 11, 2022, 12:16 PM IST

Rohit sharma: వెస్టిండీస్​తో మూడు వన్డేల సిరీస్​ క్లీన్​స్వీప్​పై భారత్​ కన్నేసింది. చివరిదైన మూడో వన్డే అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం జరగనుంది. రోహిత్​ శర్మ కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న ఈ సిరీస్​ను 2-0 తేడాతో ఇప్పటికే మన జట్టు కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్​లోనూ గెలిచి క్లీన్​స్వీప్ చేయాలని చూస్తోంది.

భారత్​.. ఒకవేళ ఈ సిరీస్​ క్లీన్​స్వీప్ చేస్తే.. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ ఘనత నమోదు చేసినట్లవుతుంది. చివరగా 2017లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో శ్రీలంకను వైట్​వాష్​ చేసింది టీమ్​ఇండియా. ఈ సిరీస్​ను క్లీన్​స్వీప్​ చేస్తే వన్డేల్లో వెస్టిండీస్​పై మెుదటి క్లీన్​స్వీప్ అవుతుంది.

Team india ODI: ఇప్పటివరకు టీమ్​ఇండియా.. వన్డేల్లో 11సార్లు క్లీన్​స్వీప్​లు చేసింది. దిగ్గజ ఆటగాడు కపిల్​ దేవ్​ మెుదటిసారి ఈ ఘనత సాధించాడు. ధోనీ, కపిల్ మాత్రమే దీనిని మూడుసార్లు నమోదు చేశారు.

భారత తరఫున కపిల్​, దిలీప్ వెంగ్​సర్కార్​, అజారుద్దీన్​, ధోనీ, గంభీర్​, కోహ్లీ,రహానె కెప్టెన్లుగా వన్డే క్లీన్​స్వీప్​లు చేశారు. చివరి వన్డేలో ఇండియా, వెస్టిండీస్​ను ఓడిస్తే ఈ ఘనత సాధించిన ఎనిమిదో కెప్టెన్​గా రోహిత్​ రికార్డు సృష్టిస్తాడు. అయితే ఈ జాబితాలో 20 వన్డే క్లీన్​స్వీప్​లతో పాకిస్థాన్​, దక్షిణాఫ్రికా జట్లు ముందున్నాయి.

రికార్డుకు సిక్స్​ దూరంలో రోహిత్..

భారత కెప్టెన్​ రోహిత్​ శర్మ మరో రికార్డుపై కన్నేశాడు. ఈ వన్డేలో​ ఓ సిక్స్​ కొడితే మాజీ కెప్టెన్​ ధోనీ రికార్డును అధిగమిస్తాడు. భారత్​ తరఫున వన్డేల్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాటర్​గా నిలుస్తాడు. ప్రస్తుతం వీరిద్దరూ 116 సిక్సర్లతో సమంగా ఉన్నారు. ధోనీ 113 ఇన్నింగ్స్​లో కొట్టగా.. రోహిత్​ 68 ఇన్నింగ్స్​లోనే ఈ మార్క్​ను అందుకోనుండటం విశేషం.

విండీస్​తో వన్డే సిరీస్​లో భారత బౌలర్లు కీలక పాత్ర పోషించారు. తొలి మ్యాచ్​లో 176 పరుగులకే వెస్టిండీస్​ను కట్టడి చేయగా, రెండో వన్డేలో ప్రత్యర్థి జట్టును 193కే ఆలౌట్​ చేశారు. తద్వారా రెండు మ్యాచ్​ల్లో టీమ్​ఇండియా విజయం సాధించింది. సిరీస్​ను కూడా సొంతం చేసుకుంది.

ఇదీ చదవండి:ఐపీఎల్ వేలం.. చెన్నై, ముంబయి జట్లకు స్పెషల్ టాలెంట్

ABOUT THE AUTHOR

...view details