IND VS WI first T20 Rohith sharma: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ విజయం తమలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పాడు. ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడిచేయడంలో బౌలర్లు మంచి ప్రదర్శన చేశారని కొనియాడాడు. బ్యాటింగ్‌లో ఇంకాస్త బాగా రాణించి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు.
ఆటను కొంచెం త్వరగా ముగిస్తే బాగుండేది. ఈ విజయం మాకు ఎంతో సంతోషాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే కట్టడి చేయడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్ విషయంలో కాస్త వెనకబడ్డాం దానిపై దృష్టి పెట్టాలి.
బిష్ణోయ్ అద్భుతమైన ప్రతిభ గల ఆటగాడు..
బిష్ణోయ్ ఎంతో ప్రతిభ కలిగిన ఆటగాడు అందుకే నేరుగా జట్టులోకి తీసుకున్నాం. అతనిలో అనేక రకాల నైపుణ్యాలు ఉన్నాయి. మ్యాచ్ ఏ దశలోనైనా బౌలింగ్ చేయగల సత్తా అతనికి ఉంది. మిగిలిన బౌలర్లను మార్చడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అతని మెుదటి అంతర్జాతీయ మ్యాచ్ ప్రదర్శన చాలా సంతోషాన్నిచ్చింది. అతనికి మంచి భవిష్యత్తు ఉంది.
జట్టుకు ఏది ముఖ్యమో ఆటగాళ్లకు తెలుసు..
శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాడిని జట్టులోకి తీసుకోకపోవడం కష్టంగా ఉంటుంది. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ వేసే వారికోసం చూశాం. అందుకే అతన్ని తీసుకోలేదు. జట్టులో ప్రతిభ కలిగిన ఆటగాళ్ల మధ్య ఇలాంటి పోటీ ఉండడం సంతోషించదగ్గ విషయం. ఇందులో నుంచి ఆటగాళ్లను ఎంపిక చేయడం నాకు చాలా కష్టమైన ఆంశం. ప్రపంచకప్‌కు ఎంపిక చేస్తామని శ్రేయస్‌కు స్పష్టంగా చెప్పాం. ప్రతి ఆటగాడు జట్టకు ఏది అవసరమో అది చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎవర్ని జట్టులోకి తీసుకోకపోయినా బాధ పడకుండా, దానికి గల కారణాన్ని అర్థం చేసుకోగలరు. అనేక సంప్రదింపుల తర్వాతే ఇలాంటి వాటిపై నిర్ణయం తీసుకుంటాం. జట్టుకు అవసరమైన ప్రతిసారి రాణించాలని చెబుతాం.