తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియా-పాక్​ ప్లేయర్స్​ కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారంటే? - t20 worldcup rohith sharma

పాకిస్థాన్​తో మ్యాచ్ జరిగేటప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లతో తాము ఏం మాట్లాడుతారో తెలిపాడు కెప్టెన్​ రోహిత్ శర్మ. ఏం అన్నాడంటే?

rohith sharma t20 world cup
రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్​

By

Published : Oct 15, 2022, 2:05 PM IST

టీ20 ప్రపంచకప్​ ఆదివారం నుంచి ప్రారంభనుంది. ఈ నేపథ్యంలో.. శనివారం ఐసీసీ 'కెప్టెన్స్‌ డే'ను నిర్వహించింది. ఇందులో టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పాల్గొని మీడియాతో మాట్లాడాడు. తమ జట్టు సన్నద్ధతను వివరించాడు. అలాగే దాయాది దేశం పాక్‌తో మ్యాచ్‌ అంటే.. సహజంగా ఉండే ఒత్తడిపై కూడా స్పందించాడు.

"పాక్‌తో ఆటను మేం అర్థం చేసుకున్నాం. ప్రతిసారీ దీని గురించి మాట్లాడి ఒత్తిడి సృష్టించడంలో అర్థం లేదు. మేం పాక్‌ ఆటగాళ్లను కలిసినప్పుడల్లా.. 'మీరు ఎలా ఉన్నారు..?' 'మీ కుటుంబం ఎలా ఉంది..?' ఇలాంటి విషయాలే మాట్లాడుతాం. ప్రస్తుతం జరుగుతోన్న విషయాలపై ముచ్చటించుకుంటాం. అలాగే కొత్త కారు ఏదైనా కొన్నారా.. లేదా అమ్మారా.. లాంటి విషయాలూ చర్చించుకుంటాం' అని రోహిత్‌ వివరించాడు.

అది భాగమే.. వెన్ను గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైన బుమ్రా స్థానంలో తాజాగా షమీని సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీనిపై హిట్‌మ్యాన్‌ స్పందిస్తూ.. గాయాలు క్రీడల్లో భాగం. జట్టును అవి పెద్దగా ఏమీ చేయలేవు. ఇన్ని మ్యాచ్‌లు ఆడినప్పుడు ఆటగాళ్లు గాయపడటం సహజం. అందుకే గతేడాది మేం బెంచ్‌లో ఉన్న ఆటగాళ్లను బలంగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాం. అవకాశం వచ్చినప్పుడు యువకులను ముందుకు తీసుకువచ్చాం. ఇక షమీ విషయానికి వస్తే.. రెండుమూడు వారాల క్రితం అతడు కొవిడ్‌తో బాధపడ్డాడు. ఆ తర్వాత ఎన్‌సీఏకు వెళ్లి మెరుగయ్యాడు. ప్రస్తుతం అతడు బ్రిస్బేన్‌లో ఉన్నాడు’ అని అన్నాడు. పెర్త్‌ నుంచి తాము బ్రిస్బేన్‌ చేరుకోగానే ప్రాక్టిస్‌ సెషన్‌ ఉందని.. షమీ జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ చేస్తాడని కెప్టెన్‌ వివరించాడు. షమీ గురించి అంతా సానుకూలంగానే ఉందని చెప్పాడు.

అది దురదృష్టం.. ఇక జట్టుకు దూరమైన బుమ్రా గురించి స్పందిస్తూ.. "అతడో నాణ్యమైన బౌలర్‌. దుదరృష్టవశాత్తూ గాయం బారిన పడ్డాడు. ఈ విషయంలో మనమేం చేయలేం. అతడి గాయం గురించి వైద్య నిపుణులతో మాట్లాడాం.. కానీ సానుకూల స్పందన వారి నుంచి రాలేదు. ప్రపంచకప్‌ ముఖ్యమే.. కానీ అతడి కెరీరే మాకు మొదటి ప్రాధాన్యం. అతడి వయసు 27-28 ఏళ్లు.. ఇంకా చాలా క్రికెట్‌ ఉంది ఆడటానికి. మేం అతడిని మిస్‌ అవుతున్నామన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అతడి ఆరోగ్యంతో రిస్క్‌ చేయలేం" అని రోహిత్‌ వివరించాడు. కాగా, టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌తో ఈ నెల 23న తలపడనుంది.

ఇదీ చూడండి: T20 World Cup: కెప్టెన్స్‌ డే.. ఒకే ఫ్రేమ్‌లో 16 మంది..

ABOUT THE AUTHOR

...view details