తెలంగాణ

telangana

ETV Bharat / sports

Rohit Sharma ODI World Cup 2023 : 'ఆ విషయం తెలిసి నా గుండె బద్ధలైంది' - వన్డే వరల్డ్ కప్​పై రోహిత్ ఏమన్నాడంటే

Rohit Sharma ODI World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌ అంటే సాధరణంగానే ఒత్తిడి ఉంటుంది. అదే సొంతగడ్డపై అయితే అది మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే తాను మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. ఓ సారి ఆ విషయం తెలిసి తన గుండె బద్దలైనట్లు తెలిసింది.

Rohit Sharma ODI World Cup 2023 :
Rohit Sharma ODI World Cup 2023 : 'ఆ విషయం తెలిసి నా గుండె బద్ధలైంది'

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 7:27 AM IST

Updated : Aug 29, 2023, 11:47 AM IST

Rohit Sharma ODI World Cup 2023 : నాలుగేళ్ల క్రితం ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 2019 ప్రపంచకప్​లో హిట్​మ్యాన్ రోహిత్ శర్మ ఎలా చెలరేగాడో క్రికెట్​ ప్రేమికులకు తెలిసిన విషయమే. ఐదు సెంచరీలు బాది 648 పరుగులు చేశాడు(odi world cup 2019 rohit sharma score). ఈ సారి వరల్డ్​ కప్​లోనూ అదే ఫామ్​ను కొనసాగించాలని తాను అనుకుంటున్నట్లు తెలిపాడు రోహిత్​. అప్పుడు అలాంటి ప్రదర్శన చేయడానికి కారణం.. తన మానసిక పరిస్థితి గొప్పగా ఉండటమేనని చెప్పాడు. ఇప్పుడు కూడా ఆ స్థితిలోకి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పాడు.

"అనుకూలమైనవైనా, ప్రతికూలమైనవైనా.. బయటి అంశాలు నాపై ఎలాంటి ప్రభావం పడకుండా.. ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. అదే నాకు ముఖ్యం. నాపై ప్రభావం చూపే వాటిని పూర్తిగా విస్మరించాలనుకుంటున్నాను. 2019 ప్రపంచకప్‌కు ముందు ఎలా ఉన్నానో.. అలా ఇప్పుడు కూడా ఉండాలనుకుంటున్నాను. అప్పుడు నా మానసిక పరిస్థితి ఎంతో గొప్పగా ఉంది. బాగా సన్నద్ధమయ్యాను. అందుకే ప్లేయర్​గా, వ్యక్తిగతంగా అప్పుడు ఎలా ఉన్నానో, ఏం చేశానో గుర్తుచేసుకోవాడనికి ప్రయత్నిస్తున్నాను" అని హిట్​మ్యాన్ పేర్కొన్నాడు.

Rohit Sharma 2019 World Cup : "జట్టు కూర్పు విషయంలో రకరకాల కారణాల వల్ల కొందరికి అవకాశం దక్కదు. రాహుల్‌ భాయ్‌ (ద్రవిడ్‌), నేను వాళ్లెందుకు జట్టులో లేరో వివరించడానికి ప్రయత్నిస్తాం. తుది జట్టును అనౌన్స్​ చేశాక.. మేం ప్లేయర్స్​తో మాట్లాడతాం. ఎందుకు వాళ్లను ఎంచుకోలేదో కూడా చెబుతాం. నేను వాళ్ల స్థానంలో ఉండి కూడా ఆలోచిస్తాను. ఎందుకంటే ప్రపంచకప్​ జట్టులో స్థానం దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు బాగా తెలుసు. 2011లో జట్టులో చోటు కోల్పోయినప్పుడు నా గుండె బద్ధలైంది. అప్పుడు యువరాజ్‌ సింగ్‌ నన్ను ఓదార్చాడు. నన్ను తన గదికి పిలిచి డిన్నర్‌కు తీసుకెళ్లాడు. నువ్వు ఇంకా చాలా ఏళ్ల పాటు క్రికెట్‌ ఆడగలవు. ఇంకా బాగా కష్టపడు. నీ స్కిల్స్​ను పెంచుకుని తిరిగి జట్టులోకి రా. నువ్వు మళ్లీ టీమ్​ఇండియాకు ఆడకుండా ఉండే ఛాన్సే లేదు. నీకు వరల్డ్​కప్​లో ఆడే అవకాశం పక్కా వస్తుంది" అని నాతో అన్నాడు.

టెస్టుల్లో 'డబుల్‌' డిజిట్స్‌.. ఫస్ట్​ బ్యాటర్‌గా రోహిత్ రికార్డ్​

కోహ్లీ ఫామ్​పై పదే పదే ప్రశ్న.. వాళ్లకు హిట్​మ్యాన్​ స్ట్రాంగ్​ కౌంటర్.. ​

Last Updated : Aug 29, 2023, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details