తెలంగాణ

telangana

ETV Bharat / sports

Rohit Sharma: 'రోహిత్‌ను మించిన సారథి లేడు' - గౌతమ్​ గంభీర్

Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్​ శర్మను మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ ప్రశంసించాడు. తనకు రోహిత్​ నిద్రలేని రాత్రులు మిగిల్చాడని పేర్కొన్నాడు.

Gautam Gambhir-Rohit Sharma
గౌతమ్ గంభీర్​-రోహిత్​ శర్మ

By

Published : Mar 10, 2022, 3:38 PM IST

Rohit Sharma: టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మపై మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్‌ చరిత్రలో హిట్‌మ్యాన్‌ అత్యుత్తమైన సారథి అని కొనియాడాడు. అతడే తనకు నిద్రలేని రాత్రులు మిగిల్చాడని చెప్పాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన గంభీర్‌ రోహిత్‌ కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"ఐపీఎల్‌లో నేను కెప్టెన్‌గా ఉండగా.. రోహిత్‌ ఒక్కడే నాకు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. అందులో క్రిస్‌గేల్‌ కానీ, ఏబీ డివిలియర్స్‌ కానీ మరే ఇతర స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ లేరు. రోహిత్‌ ఒక్కడే నాకు నిద్ర లేకుండా చేశాడు. అలాగే ఐపీఎల్‌ చరిత్రలోనూ అతడికి మించిన సారథి లేడు"

-గౌతమ్​ గంభీర్​

రోహిత్‌ 2013లో తొలిసారి ముంబయి కెప్టెన్‌గా ఎంపికవ్వగా అదే ఏడాది ఆ జట్టును తొలిసారి ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అప్పుడు రికీ పాంటింగ్‌ నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన హిట్‌మ్యాన్‌ ఐపీఎల్‌లో ముంబయిని అత్యంత విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్దాడు. ఈ క్రమంలోనే ఐదుసార్లు ఛాంపియన్‌గా చేసి అందరికన్నా ముందున్నాడు. దీంతో రోహిత్‌ ఐపీఎల్‌లో అత్యుత్తమ సారథిగా గుర్తింపు పొందాడు. మరోవైపు గంభీర్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు కెప్టెన్‌గా రెండుసార్లు ట్రోఫీ అందించిన సంగతి తెలిసిందే. కొంతకాలం నుంచే ఆటకు దూరమైన అతడు ఇప్పుడు క్రీడావిశ్లేషకుడిగా ఉన్నాడు. ఇటీవల లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు మెంటార్‌గా నియమితుడయ్యాడు. మరి ఈసారి మెగా టోర్నీలో గంభీర్‌ కొత్త జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.

ఇదీ చదవండి:గోవాలో ఘనంగా రాహుల్‌ చాహర్‌ వివాహం

ABOUT THE AUTHOR

...view details